క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. వాటి నుంచి కొలుకున్నాక తిరిగి తమ కెరీర్ ను కొనసాగించడమూ సహజమే. ఇలా గాయాలు ఆటగాళ్ల జీవితంలో సర్వసాధారణం అయిపోతాయి. ఈక్రమంలో తాజాగా విండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే రోహిత్ గాయం పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రెండో ఓవర్లో 11పరుగుల వద్ద వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికీ భారత్ ను సుర్యకుమార్ యాదవ్ ఒంటి చేత్తో గెలిపించాడు. రోహిత్ గాయం పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు.
‘‘రోహిత్ శర్మ ఆన్ సైడ్ బౌండరీ బాదినప్పుడు అతను ప్రతి స్పందించిన విధానం, ఆ క్రమంలో ఓ ఆటగాడిగా అతను ఎంత బాధ అనుభవించాడో నాకు తెలుసు. అతను తన ఫిట్‌నెస్‌కు ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. రోహిత్ వచ్చే రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. అతను ఉన్నా.. లేకున్నా భారత్ కు పోయేదేం లేదని కనేరియా తెలిపాడు. రాబోయే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు భారత జట్టుకు రోహిత్ శర్మ ఎంతో అవసరం. కాబట్టి అతను విశ్రాంతి తీసుకున్నా శ్రేయాస్ అయ్యార్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ లాంటి ఓపెనింగ్ చేయగల సమర్థులు ఇండియాకు ఉన్నారని కనేరియా తెలిపాడు.
ఇకపోతే డానిష్ కనేరియా సూర్యకుమార్ యాదవ్ స్ట్రోక్-ప్లే, సమర్థవంతమైన అతని బ్యాటింగ్ ను కొనియాడాడు. ‘సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్లాసికల్ ప్లేయర్ అని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుత క్రికెట్‌లో అతనిలాగా ఫ్లిక్ షాట్ ఆడేవారు ఎవరూ లేరు. అతను ఫ్లిక్‌లో తన మణికట్టును పైపైకి ఉపయోగించే విధానం అద్భుతం’ అంటూ కనేరియా సూర్య కుమార్ ను ప్రశంసించాడు. ఈ మేరకు యూట్యూబ్ లో డానిష్ కనేరియా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచాడు. మరి భారత క్రికెటర్ల పై ఓ పాక్ ఆటగాడి ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.