మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 కోల్పోయింది. అది కూడా నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పరాజయం ఎవరూ ఊహించలేదు. మరి ఈ ఓటమిపై రోహిత్ ఏమన్నాడంటే..?
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. చివరి రెండో వన్డేల్లో ఓడి సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. దీంతో స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత తొలి వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌ను నెగ్గి.. మంచి జోష్‌లో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ ఓటమితో డీలా పడింది. పైగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సైతం ఉండటం, అది కూడా మన దేశంలోనే కావడంతో ఈ ఓటమి మరింత బాధిస్తోంది. భారత్‌పై సిరీస్ గెలవడం ఆస్ట్రేలియాకు ఎంతో ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అది వరల్డ్ కప్‌లో మనపై ప్రభావం చూపుతుంది. పైగా ఈ సిరీస్‌లో టీమిండియా ఓడింది బ్యాటింగ్ వైఫల్యంతో కావడం మరింత బాధించే అంశం.
ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బ్యాటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ కారణంగానే తాము ఓడిపోయినట్లు పేర్కొన్నాడు. ఒక్కరు నిలబడినా ఈ మ్యాచ్‌లో గెలిచే వాళ్లం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జట్టులోని ప్రధాన బ్యాటర్లు తనతో సహా అంతా విఫలం అయ్యారని, ఇంత చెత్త బ్యాటింగ్ చేస్తే గెలవడం కష్టమే అని అన్నాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. ఉన్నంత సేపు వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, వేగంగా ఆడే క్రమంలోనే తన వికెట్ సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండానే.. ఆసీస్ 269 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లతో రాణించగా.. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు గిల్, రోహిత్ సిక్సర్లు సైతం బాదారు. కానీ.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ ఒక్కడే 54 పరుగులతో రాణించినా.. అది విజయానికి సరిపోలేదు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, ఓటమిపై రోహిత్ శర్మ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “We didn’t bat well”.
— Johns. (@CricCrazyJohns) March 22, 2023