టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు. శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. భారీ షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసిన రోహిత్.. చాలా రోజులుగా రాని.. భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ.. కరుణరత్నే వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతిని లూజ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. మంచి టచ్‌లో కనిపించి, భారీ షాట్లతో విరుచుకుపడుతున్న టైమ్‌లో రాంగ్ షాట్ ఆడి అవుట్ కావడాన్ని రోహిత్
శర్మ జీర్ణించుకోలేకపోయాడు. గ్రౌండ్‌లోనే బాధతో తల కిందికేసి.. నేలవైపు చూస్తే.. భావోద్వేగానికి గురయ్యాడు. రోహిత్ ఎమోషనలైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్‌ను అలా చూసిన క్రికెట్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఛాంపియన్ ప్లేయర్లకు ఇలాంటి పరిస్థితి రావాడం సహజమని.. మళ్లీ రోహిత్ నుంచి ఒక మంచి నాక్ చూస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ విశ్వరూపం..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న.. టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 116 పరుగులుతో అదరగొట్టాడు. అలాగే రోహిత్ శర్మ 42 పరుగులు చేయడంతో.. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ కలిసి 95 పరుగులు జోడించి.. శుభారంభం అందించాడు. ఇక రోహిత్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ.. రెండో వికెట్‌కు గిల్‌తో కలిసి సెంచరీ పైచిలుకు పరుగులు జోడించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా ఆడే క్రమంలో గిల్ అవుట్ అయ్యాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగులు చేసి.. రజిత బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఇక గిల్ అవుటైన తర్వాత.. తన గేర్ మార్చుకున్న కోహ్లీ.. లంక బౌలర్లపై జూలువిదిల్చిన సింహంలా విరుచుకుపడ్డాడు. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్సులతో 166 పరుగులతో దుమ్మురేపాడు. మరికొన్ని ఓవర్లు ఉంటే.. డబుల్ సెంచరీ కూడా బాదేసేలా కనిపించాడు. లంక బౌలర్లు అదృష్టం కొద్ది.. 50 ఓవర్లు పూర్తి కావడంతో 166 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో పర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్(7), సూర్యకుమార్ యాదవ్(4) వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 2 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద శ్రీలంక ముందు టీమిండియా 391 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ, గిల్ ఇన్నింగ్స్‌లతో పాటు రోహిత్ శర్మ ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma was so disappointed the way he got out. pic.twitter.com/QLS94GzAP9
— CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023