374 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేస్తున్న క్రమంలో ఒక్క ఓపెనర్ తప్ప.. మిగతా బ్యాటర్లు విఫలం అవుతున్నా.. చివరి వరకు ఒక్కడు మాత్రం పట్టువదలకుండా పోరాటం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపిస్తూ.. మన బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని పోరాటం చూసి.. రూల్స్ ప్రకారం అవుటైనా.. నైతికంగా కరెక్ట్ కాదని భావించి.. అతని ఔట్ కోసం అపీల్ చేయలేదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ సంఘటనతో క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తికి మరోసారి టీమిండియా మారుపేరుగా నిలిచింది. అందులోనూ.. ఇలాంటి ఒక సందర్భంలో మనకు ద్రోహం చేసిన టీమ్‌పై రివేంజ్ తీర్చుకోకుండా.. స్పోర్ట్స్‌మెన్‌షిప్ చూపించడం మరో గొప్ప విషయం. మనకు అన్యాయం చేసినోడి విషయంలో కూడా న్యాయంగా వ్యవహరించాడు రోహిత్ శర్మ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీలంకతో మంగళవారం గౌహతీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(83), శుబ్‌మన్ గిల్(70) పరుగులతో అదిరిపోయే స్టార్ట్ ఇవ్వడం.. దాన్ని రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(113) కంటిన్యూ చేస్తూ.. సెంచరీతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్‌ను లంక ఛేదిస్తుందనే నమ్మకం ఎవరీ లేదు. అందుకు తగ్గట్లే.. సిరాజ్ ఆరంభంలోనే లంకను చావు దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఫెర్నాండోతో పాటు కుశల్ మెండిస్‌ను అవుట్ చేయడంతో లంక 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఇక్కడి నుంచి ఏ దశలోనూ శ్రీలంక లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తుండటంతో మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంది. కానీ.. లంక కెప్టెన్ డసన్ షనక మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోయినా.. టీమిండియా బౌలర్లును సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. లంక స్కోర్ బోర్డును 300 దాటించడంతో పాటు తాను కూడా సెంచరీకి చేరువయ్యాడు. ఇన్నింగ్స్ ముగియడానికి మరో మూడు బంతులు ఉన్న సమయంలో షనక 98 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. నాలుగో బాల్ వేసేందుకు సిద్ధమయ్యాడు షమీ.. కానీ షనక మాత్రం ఎలాగైన సింగిల్ కంప్లీట్ చేసి.. తాను స్ట్రైక్ తీసుకుని సెంచరీ పూర్తి చేసుకోవాలనే తొందరలో షమీ బాల్ వేయకముందే క్రీజ్ వదిలేసి పరుగందుకున్నాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ చేసి అపీల్ కూడా చేశాడు.
అయితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలగచేసుకుని.. 98 రన్స్‌తో ఉన్న షనకను అవుట్ చేసే విధానం ఇది కాదని, రూల్స్ ప్రకారం సరైందే అయినా.. నైతికంగా కరెక్ట్ కాదని అపీల్‌ను ఉపసంహరించుకోమని షమీని కోరడంతో.. షమీ అంపైర్ వద్దకు వెళ్లి అపీల్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో.. షనక అవుట్ కాకుండా బతికిపోయాడు. ఇక 5వ బంతికి స్ట్రైక్‌పైకి వచ్చిన షనక ఫోర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సంఘటనతో రోహిత్ శర్మ గొప్ప క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడంటూ క్రికెట్ ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది. అయితే.. ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇదే శ్రీలంక టీమ్ మాత్రం టీమిండియాకు ఘోరమైన అన్యాయం చేసింది. ఏ మాత్రం క్రీడా స్ఫూర్తి చూపించకుండా.. సిగ్గులేకుండా నో బాల్‌తో సెహ్వాగ్ సెంచరీని అడ్డుకుంది. అప్పుడు లంకను క్రికెట్ ప్రపంచం మొత్తం ఛీ అంటూ చీదరించుకుంది.
2010లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 170 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ టార్గెట్‌ను టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఒంటిచేత్తో ఊదిపడేశాడు. అయితే.. చివర్లో టీమిండియా విజయానికి 5 పరుగులు అవసరమైన సమయంలో సెహ్వాగ్ 99 రన్స్‌తో స్ట్రైక్‌లో ఉన్నాడు. విజయానికి 5 రన్స్ అవసరమైనా.. సెహ్వాగ్ సెంచరీకి ఒక్క రన్ మాత్రమే కావాలి. సెహ్వాగ్ సెంచరీ చేయడం ఖాయం అనుకున్నారు. కానీ.. లంక బౌలర్ సూరజ్ రణ్‌దీవ్ మాత్రం.. టీమిండియా పాలిట విలన్ అయ్యాడు. తొలి బాల్‌ను చాలా లోగా వేయడంతో.. సెహ్వాగ్‌తో పాటు కీపర్ కమ్ లంక కెప్టెన్ కుమార సంగార్కరా సైతం బీట్ అవ్వడంతో బైస్ రూపంలో టీమిండియా 4 రన్స్ వచ్చాయి. దీంతో స్కోర్ లెవెల్ అయింది. తర్వాతి రెండు బాల్స్ డాట్స్ అయ్యాయి.
అయితే.. 4వ బాల్ వేసే ముందు తిలకరత్నే దిల్షాన్ వెళ్లి బౌలర్ రణ్‌దీవ్‌తో మాట్లాడాడు. కానీ.. సెహ్వాగ్ మాత్రం నాలుగో బాల్‌కు భారీ సిక్స్ బాది సెంచరీతో పాటు టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ.. అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో సెహ్వాగ్ కొట్టిన సిక్స్ వృథా అయింది. నో బాల్‌తో వచ్చిన అదనపు రన్‌తోనే టీమిండియా విజయం పూర్తి కావడంతో.. సెహ్వాగ్ 99పైనే నాటౌట్‌గా మిగిలాడు. ఈ మ్యాచ్ తర్వాత శ్రీలంక టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆ నో బాల్‌ను రణ్‌దీప్ కావాలనే వేసినట్లు అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. దిల్షాన్ సలహా మేరకు నో బాల్ వేసినట్లు చెప్పి.. సెహ్వాగ్ రూమ్‌కు వెళ్లిమరీ క్షమపణలు చెప్పాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం సెహ్వాగ్‌కు సారీ చెప్పి.. రణ్‌దీప్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఇలా.. ఒక ఆటగాడు సెంచరీ చేయకుండా ఉండేందుకు కావాలిన నో బాల్ వేసిన లంక క్రికెట్ ప్రపంచం ముందు తలదించుకుంది.
కానీ.. ఇప్పుడు షమీ పక్కా క్రికెట్ లా ప్రకారం చేసినా.. అది నైతికత అనిపించుకోదని, షనక అద్భుతంగా పోరాటం చేశాడని, అతన్ని అవుట్ చేసే విధానం ఇది కాదని చెప్పి.. షమీతో అపీల్‌ను విత్‌డ్రా చేయించాడు. ఒక ఆటగాడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఈ నిజాయితీ, నైతిక విలువలే. ఒకనొక సందర్భంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోకుండా రోహిత్ చూపించిన క్రీడా స్ఫూర్తి.. ఈ తరం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది. కనీసం ఇది చూసైనా లంక సిగ్గు తెచ్చుకోవాలని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అలాగే శ్రీలంక మాజీ దిగ్గజాలు సైతం రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The real winner was the sportsmanship of Rohit Sharma for refusing to take the run out. I doff my cap to you ! https://t.co/KhMV5n50Ob
— Sanath Jayasuriya (@Sanath07) January 10, 2023