టీమిండియా నయా స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ రెండు వైపులా పదునున్న కత్తి.. సరిగ్గా వాడకుంటే మనకే నష్టం. ఇది ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న అభిప్రాయం. అందుకే ఈ యువ సంచలనాన్ని జాగ్రత్త ఉపయోగించుకోవడంపై కోచ్‌గా ద్రవిడ్‌కు, కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఒక అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. ఐపీఎల్ 2022లో ఉమ్రాన్ బౌలింగ్ స్పీడ్‌కు యావత్ క్రికెట్ షాకైయింది.
టీమిండియాలో ఇతనికి స్థానం పక్కా అనుకున్నారు. అలాగే సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేసినా.. తుది జట్టులో ద్రవిడ్ చోటు ఇవ్వలేదు. అతను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని ఉమ్రాన్‌ను పదునుపెట్టాడు ద్రవిడ్. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తాత్కలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అతనికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సిరీస్‌లో ఉమ్రాన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుని టీ20 సిరీస్‌కు సిద్ధమయ్యాడు. నేటి రాత్రి 10.30 గంటలకు సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ ఎంపిక సహా ఇతర విషయాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా. ప్రాక్టీస్ కూడా ప్రారంభించాను. టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ శైలిని పరిశీలిస్తున్నాం. జట్టుకు ఏం కావాలో ఉమ్రాన్‌కు బాగా తెలుసు. వచ్చే ప్రపంచకప్ కోసం జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం. ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి అవకాశాలు ఇవ్వడంపై ఎటువంటి సందేహం లేదు.
అయితే, ఫ్రాంచైజీ క్రికెట్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంటుంది’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ స్పీడ్ కొన్ని సార్లు లాభంతో పాటు భారీగా పరుగులు ఇచ్చి జట్టుకు నష్టం కూడా తెచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం గురించి బాగా తెలిసిన ద్రవిడ్.. ఉమ్రాన్‌ను సానబెట్ట స్పీడ్ బౌలింగ్‌కు స్వర్గధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్‌పై ఉమ్రాన్‌ను ఒక వజ్రాయుధంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు రోహిత్ మాటాలను బట్టిచూస్తే అర్థం అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma opines on Umran Malik’s future for Team India.
.
.
.#UmranMalik #RohitSharma #CricketTwitter pic.twitter.com/hm8V59pGmv— CricTracker (@Cricketracker) July 7, 2022