భారత్-దక్షిణాఫ్రికా మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఫలితం కచ్చితంగా తేలనున్న ఈ మ్యాచ్‌లో ఎవరైనా గెలిచే స్థితికి మ్యాచ్ చేరింది. దీంతో నాలుగో రోజే మ్యాచ్ ఫలితం తేలనుంది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, గొడవలు, ఆవేశాలు చాలానే జరుగుతున్నాయి. ఇదే క్రమంలో.. టీమిండియా కీపర్ రిషభ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో అవుట్ అయి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు కాకుండా ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. దీంతో మైదానంలోని క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న టీమిండియా క్రికెటర్లు షాక్ తిన్నారు. తీరా అసలు విషయం తెలిసి అంతా నవ్వుకున్నారు.
Rishabh Pant has been struggling to get going in his last 10 Test innings.#RishabhPant #India #SouthAfrica #SAvIND #BetHive pic.twitter.com/SOLyTA8Zga
— BetHive (@The_BetHive) January 5, 2022
అసలు విషయం ఏమిటంటే.. పంత్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ డస్సెన్ స్లెడ్జింగ్‌కు దిగాడు. దీంతో పంత్ కూడా నోటికి పనిచెప్పాడు. ‘హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడకు, నోరు మూసుకో’ అంటూ పంత్, డస్సెన్‌కు రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత డస్సెన్ కూడా ఏదో అనడంతో కోపంతో పంత్ అనవసరమైన షాట్‌కు వెళ్లి అవుట్ అయ్యాడు. దీంతో కోపంగానే డ్రెస్సింగ్ రూమ్‌కు పయనమయ్యాడు. కానీ ఆశ్యర్యకరంగా సౌత్ ఆఫ్రికా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాడు. కొంత సేపటికి తేరుకున్న పంత్.. మళ్లీ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. ఈ ఘటనతో అంతా షాక్ తిన్నారు. పాపం అవుట్ అయిన బాధలో పంత్ మైండ్ పనిచేయడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలా కోపంలో దారిమర్చిన పంత్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చెత్త షాట్ ఆడి అవుటైన పంత్! డ్రెస్సింగ్ రూమ్ లో ద్రావిడ్ సీరియస్!
— Cric Zoom (@cric_zoom) January 5, 2022