నాలుగో రోజు ఆటలో భాగంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ హైలెట్ గా మారింది. ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన కిషన్ రిషబ్ పంత్ ని గుర్తు చేసాడు.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దూకుడు చూపిస్తుంది. డ్రా అవుతుందన్న మ్యాచులో ఫలితం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి గెలుపు దిశగా దూసుకెళ్తుంది. సిరాజ్ ధాటికి మొదటి ఇన్నింగ్స్ లో కుదేలైన విండీస్ జట్టు.. ఆ తర్వాత భారత బ్యాటర్లను నిలువరించడంలో విఫలమైంది. విండీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 182 పరుగులు చేసింది. రోహిత్(57), జైస్వాల్(38), గిల్(29), కిషాన్(52) ఇలా వచ్చిన వారందరూ బ్యాట్ ని ఝళిపించడంతో విండీస్ ముందు 365 పరుగుల భారీ స్కోర్ ని ఉంచింది. ఇక ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో విండీస్ జట్టు నిలకడగా ఆడుతుంది. నాలుగో రోజు అట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ సంగతి పక్కన పెడితే నాలుగో రోజు ఆటలో భాగంగా కిషన్ ఆడిన ఇన్నింగ్స్ రిషబ్ పంత్ ని గుర్తు చేయడం విశేషం.
టీమిండియాకి టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ అయినటువంటి పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే. పంత్ గాయం భారత క్రికెట్ లో తీరని లోటుని మిగిల్చింది. పంత్ స్థానంలో వచ్చిన ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపించలేదు. శ్రీకర్ భరత్ పూర్తిగా విఫలం కాగా.. ఇటీవలే విండీస్ తో టెస్టు సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిషన్ తొలి టెస్టులో తొలి పరుగు కోసం బాగా ఇబ్బంది పడ్డాడు. ఇక రెండో ఇనింగ్స్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో కిషాన్ ని ముందు పంపగా చెలరేగి ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకొని వచ్చిన అవకాశాన్ని నిరూపించుకున్నాడు.ఓవరాల్ గా 34 బంతులు ఎదుర్కొన్న కిషాన్ 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ వికెట్ కీపర్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు కిషన్ కొట్టిన వన్ హ్యాండెడ్ సిక్స్ వికెట్ కీపర్ పంత్ ని గుర్తు చేసింది. వ్యక్తిగత స్కోర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోచ్ వేసిన లో ఫుల్ టాస్ ని ఒంటి చేత్తో మిడాన్ మీదుగా తరలించాడు. ఈ షాట్ ని చూస్తుంటే అచ్చం పంత్ ని తలపించింది. గతంలో పంత్ ఎన్నో సిక్సులను ఇదే స్టయిల్లో కొట్టడం విశేషం. ప్రస్తుతం టీంతో పంత్ లేకపోయినా కిషాన్ మాత్రం పంత్ షాట్ ఆడి అందరిని సర్ ప్రైజ్ చేసాడు. ఇక కిషాన్ ఈ సిక్స్ తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగానే కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసాడు. మొత్తానికి కిషన్ కొట్టిన వన్ హ్యాండ్ సిక్స్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
That’s a smashing way to bring your maiden Test 50*@ishankishan51
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIFaqpoGiD
— FanCode (@FanCode) July 23, 2023