యాషెస్ లో ఇంగ్లాండ్ అభిమానుల అతి చేష్టలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ మీద దాడి చేస్తూ అవమానించారు.
యాషెస్ అంటే రెండు జట్ల మధ్య ప్రతీకార సిరీస్ కాదు. రెండు దేశాల మధ్య జరిగే ఒక యుద్ధం. వినడానికి కాస్త ఓవర్ గా అనిపించినా ఈ రెండు దేశాలు యాషెస్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో సొంతగడ్డపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ ని కోల్పోయిన సంగతి తేలిసిందే. మొదటి రెండు టెస్టులు ఓడిపోగా మూడో టెస్టులో గెలిచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ విజయాన్ని వరుణుడు అడ్డుకోవడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో 2023 యాషెస్ ని ఆస్ట్రేలియా రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదవ టెస్టు ఓడిపోయినా యాషెస్ ఆసీస్ దగ్గరే ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ సిరీస్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు ఆసీస్ దిగ్గజం పాంటింగ్ మీద దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
యాషెస్ లో ఇంగ్లాండ్ అభిమానుల అతి చేష్టలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. సిరీస్ ప్రారంభం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లను మాటలతో నొప్పిస్తున్న సంగతి తెలిసిందే. స్మిత్, క్యారీ, హెడ్, ఖవాజా ఇలా అందరినీ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మాటలతో దూషించారు. వీరి ప్రవర్తన హద్దు మీరడంతో నాలుగో టెస్టుకి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాకు గట్టి భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఆటగాళ్లనే కాకుండా వారి ఫ్యామిలీ జోలికి వెళ్లిన అభిమానులు ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ పాంటింగ్ మీద ఎవరో ఒకరు ద్రాక్ష పళ్ళు విసురుతూ దాడి చేసాడు. ప్రస్తుతం నాసిర్ హుస్సేన్ తో కలిసి కామెంటరీ చేస్తున్న పాంటింగ్ ఈ ఘోర అవమానాన్ని ఎదుర్కున్నాడు. ఈ సందర్భంగా ఒక ఆకతాయి పాంటింగ్ వైపు విసరగా అవి నేరుగా పాంటింగ్ షూ వద్దకు వచ్చి తగిలాయి. ఇక వీటిలో కొన్ని పాంటింగ్ ముఖాన్ని తాకడంతో అసహనానికి గురైన ఈ ఆసీస్ లెజెండ్.. అతనెవరో ఊరుకునేదే లేదంటున్నాడు. అతడిని పట్టుకోవాలని సెక్యూరిటీని కోరాడు.
ఇక యాషెస్ లో భాగంగా నిన్న మొదలైన చివరిదైన చివరి టెస్టులో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. 283 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే హ్యారీ బ్రూక్ 85 పరుగులతో రాణించాడు. బెన్ డకెట్ , క్రిష్ వోక్స్, మొయిన్ అలీ పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు తీసుకోగా.. మర్ఫీ, హాజెల్ వుడ్ కి చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజ్ లో ఖవాజా (26) లబు షేన్ (2) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు ఇంకా 222 పరుగులు వెనకపడి ఉంది. మొత్తానికి ఇంగ్లాండ్ ఆకతాయి చేసిన పనికి పాంటింగ్ కి ఘోర అవమానం జరగడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Hi @piersmorgan & @TheBarmyArmy
Is this within the spirit of the game?
Pelting grapes at Ponting who’s just a commentator.
I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3
— FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023