‘వికెట్ కీపింగ్..’ క్రికెట్ ను కెరీర్ ఎంచుకునే వారిలో అతి తక్కువ మంది ఎంచుకునే కేటగిరి ఇదే. వాస్తవంగా చెప్పాలంటే.. కీపింగ్ ఒక కల. బ్యాటింగ్, బౌలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటే తక్కువ సమయంలోనైనా నేర్చుకోవచ్చేమో కానీ, కీపింగ్ స్కిల్స్ లో నైపుణ్యం సాధించాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాంటి.. కీపింగ్ స్కిల్స్ కు మహేంద్ర సింగ్ ధోనీ పెట్టింది పేరు. స్టంప్ అవుట్, రనౌట్ వంటివి చేయడంలోనూ, డీఆర్ఎస్ కోరడంలోనూ ధోనీకి మరే ఏ క్రికెట్ సాటిరాడు. అందులోనూ అప్పుడప్పుడు ధోనీ చేసే విన్యాసాలు మనందరకి సుపరిచితమే. రెప్పపాటులో పని కానిచ్చేస్తుంటాడు. అలాంటి ధోనీకే టీమిండియా మహిళా వికెట్ కీపర్.. రిచా ఘోష్ సవాల్ విసురుతోంది.
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్ 2022ను ఇండియా కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగా.. అనంతరం భారత జట్టు 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది. స్మృతి మందానా(51 రన్స్) సూపర్ హిట్టింగ్‌తో లక్ష్యం మరీ ఈజీ అయ్యింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్.. రిచా ఘోష్ చేసిన కీపింగ్ స్కిల్స్ పై ప్రశంశలు అందుతున్నాయి. ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఒక బాల్.. పిచ్ పడ్డాక కనీసం లేవను కూడా లేవలేదు. అందులోనూ భారీగా టర్న్ అయ్యింది. ఈ బాల్ ను రిచా చాలా తెలివిగా కాలు అడ్డం పెట్టి మరీ ఆపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
— Richard (@Richard10719932) October 15, 2022
వీడియోలో అంత చెప్పుకోదగ్గ సందర్భం లేనప్పటికీ.. ప్రత్యర్థి జట్టు 30 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అప్పగించాక కూడా ఆమె తేలిగ్గా తీసుకుకుండా బాల్ ఆపడంపై ఆమెను ప్రశంసిస్తున్నారు. రిచా ఒక కీపింగ్ లోనే కాదు.. ధోనీ స్టయిల్లో సిక్సర్లు కూడా బాధగలదు. హర్మన్ ప్రీత్ కౌర్ తరవాత భారత జట్టులో చెప్పుకోదగ్గ భారీ హిట్టర్ అంటే.. రిచానే. కాగా, ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి. పురుషుల జట్టు కూడా ఏడుసార్లు ఆసియాకప్ గెలిచింది.
🏆 𝗖𝗛𝗔𝗠𝗣𝟳𝗢𝗡𝗦 – 𝗖𝗼𝗻𝗴𝗿𝗮𝘁𝘂𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝘁𝗼 𝗜𝗻𝗱𝗶𝗮 𝗼𝗻 𝗿𝗲𝗴𝗶𝘀𝘁𝗲𝗿𝗶𝗻𝗴 𝗮 𝗳𝗶𝗻𝗲 𝟴-𝘄𝗶𝗰𝗸𝗲𝘁 𝘃𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝘁𝗵𝗲 #𝗪𝗼𝗺𝗲𝗻𝘀𝗔𝘀𝗶𝗮𝗖𝘂𝗽 𝗳𝗶𝗻𝗮𝗹 💯#INDvSL #AsiaCup2022 #SLvIND #TeamIndia #Fan2Play pic.twitter.com/tC4tzTTT84
— Fan2Play (@fan2_play) October 15, 2022