ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపుతున్న ఐపీఎల్ కే మాయని మచ్చ తెచ్చాడు.. ఓ యువ క్రికెటర్. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరింది. స్పందించిన ఇంటర్‌పోల్.. అతని సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..
నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లమిచ్చనే కష్టాల్లో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ ఆరోపణలతో అతన్ని సస్పెండ్ చేస్తూ నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆపై అరెస్ట్ వారెంట్ జరీ చేసింది. ఆపై ఈ విషయం తెలిశాక.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తొలగించారు. అక్కడినుండి ఎటువెళ్లాడో అతని జాడ తెలియరాలేదు. ఈ క్రమంలో అతని కోసం ఇంటర్‌పోల్ సాయం కోరింది.. నేపాల్ ప్రభుత్వం. అందుకు స్పందించిన ఇంటర్‌పోల్.. అతని సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది.
International police organization Interpol has issued a diffusion notice against rape accused Nepali cricketer Sandeep Lamichhane. pic.twitter.com/TCQyM1QLWn
— No Next Question (@NoNext_Question) September 27, 2022
ఈ విషయంపై స్పందించిన సందీప్ లమిచ్చనే తాను ఏ పాపం ఎరుగనని, త్వరలోనే నేపాల్ వస్తానని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదనని నిరూపిస్తానని తెలిపాడు. ఈ ఆరోపణలు తనను మానసికంగా కృంగదీశాయని తెలిపాడు. అయితే, తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. 22 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచతమే. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడాడు. బిగ్‌బాస్, సీపీఎల్ వంటి విదేశీ లీగుల్లోనూ ఆడుతుంటాడు.
ఇంతకీ కేసేంటంటే..
సందీప్ లమిచ్చనే తనపై ఖాఠ్మాండులోని ఓ హోటల్‌లో అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను సందీప్ అభిమానని, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి వాటి ద్వారా తాము మాట్లాడుకుంటూ ఉంటామని పేర్కొంది. అయితే, ఆమె ఆరోపణలను లమిచ్చనే ఖండించాడు. ఈ తప్పుడు ఆరోపణలపై తాను చట్టపరంగా పోరాడతానని ఫేస్‌బుక్ పోస్టు ద్వారా పేర్కొన్నాడు. చూడాలి ఈ కేసు ఎక్కడివరకు వేకుతుందన్నది.