ఆర్సీబీ మహిళా జట్టు.. లీగ్ లోనే తొలి గెలుపు చూసింది. అయితే దీనికి కారణం.. వాళ్ల ప్రదర్శనతో పాటు కింగ్ కోహ్లీ అంటున్నారు. విరాట్ వచ్చాడు అమ్మాయిలు మ్యాచ్ గెలిచారని మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగింది?
మహిళా ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ జట్టుకు తొలి విజయం. అవును మీరు విన్నది కరెక్టే. వరసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన బెంగళూరు మహిళా జట్టు.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచులో మాత్రం అద్భుతమైన విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే కింగ్ కోహ్లీ. వరస వైఫల్యాల నుంచి బయటపడి తొలి విజయం సాధించడానికి కారణం కోహ్లీనే అని అంటున్నారు. అందుకు సంబంధించిన లాజిక్ ని ఫొటో ప్రూఫ్ తో సహా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చకు కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రి 3, శోభన-సోఫీ డివైన్ తలో 2 వికెట్లు తీశారు. కుప్పకూలేలా కనిపించిన యూపీ జట్టును గ్రేస్ హారిస్ (46) కాపాడింది. లేదంటే ఈ మాత్రం స్కోరు అయినా సరే ఉండేది కాదు. దీప్తి (22), కిరణ్ నవ్ గిరె (22) కూడా తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు.. కనిక అహుజా (46), రిచా ఘోష్ (31 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. యూపీ జట్టుకు ఐదు మ్యాచుల్లో ఇది మూడో ఓటమి కాగా.. బెంగళూరుకు మాత్రం ఐదు మ్యాచుల తర్వాత ఇదే తొలి విజయం.
అయితే బెంగూళురు విజయానికి కారణం.. ఆ జట్టులో అద్భుతమైన ప్రదర్శనని అందరూ అనుకుంటున్నారు. అయితే వాళ్లు అలా ఇన్ స్పైర్ అయి ఆడటానికి కోహ్లీనే రీజన్ అని తెలుస్తోంది. నిన్న మ్యాచ్ రోజు ఉదయం బెంగళూరు జట్టుతో చిట్ చాట్ చేసిన విరాట్.. ఆడటం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. దీంతో ఎనర్జీ తెచ్చుకున్న ఆర్సీబీ మహిళలు.. అదే ఊపుని గ్రౌండ్ లోనూ చూపించారనిపిస్తోంది. దీంతో తొలి విజయం వాళ్ల ఖాతాలో చేరింది. అయితే టాప్-4కి అర్హత సాధించే అవకాశాలు ఇంకా ఆర్సీబీని ఉండనే ఉన్నాయి. మరి బెంగళూరు జట్టు ఏం చేస్తుందనేది చూడాలి. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో కోహ్లీ ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి ఐపీఎల్ లోనూ ఆర్సీపీ పురుషుల జట్టు అద్భుతమైన ప్రదర్శన చేయొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమై ‘ఈసాలా కప్ నమ్ దే'(ఈసారి కప్ మనదే) అనే స్లోగన్ నిజమవుతుందేమో చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే.. ఆర్సీబీ మహిళా జట్టు విజయం వెనక కోహ్లీ ఉన్నాడని మాట్లాడుకోవడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Virat Kohli distributed Prasad of Mahakaleshwar Temple to RCB women’s team before the match nd motivated them. #RCBvUPW
Action Reaction pic.twitter.com/68JU6reP25
— Akshat (@AkshatOM10) March 15, 2023