టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రిబావా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజకీయలపై ఆసక్తితో 2019లో బీజేపీలో చేరిన రివాబా.. అప్పటి నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సిన్హా జడేజాను కాదని.. బీజేపీ అధిష్టానం రివాబా జడేజాకు బీ ఫామ్ ఇచ్చింది. ఇక భర్తతో కలిసి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న రివాబా.. తొలి సారి ఎమ్మెల్యేగా గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కాగా.. రివాబాకు కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్ర సిన్హా చతుర్సింహ జడేజా ప్రధాన పోటీ దారుగా భావించారు. అందుకు కారణం.. జడేజా తండ్రి, సోదరి ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు.
కానీ. ఆయన కంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్ నుంచి రివాబా పోటీని ఎదుర్కొన్నారు. రివాబాకు 50 వేలకు పైగా భారీ మెజార్టీ దక్కినా.. రెండో స్థానంలో ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్మూర్ నిలవడం విశేషం. గుజరాత్‌లోని ఒక బడా వ్యాపారవేత్త కూతురైన రివాబా.. ఆత్మీయ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత జడేజాను వివాహం చేస్తున్న రివాబా.. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. మొత్తం ఓట్లలో రివాబాకు 58 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. అయితే.. లీడ్‌లో ఉండగానే విజయం లాంఛనమైన తర్వాత రివాబా.. భర్త జడేజాతో కలిసి జామ్‌నగర్‌లో భారీ ర్యాలీ తీశారు. ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి, తనకు ఓటు వేసిన వారికి, తనకు మద్దతు తెలిపిన వారి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.
#GujaratAssemblyPolls | BJP candidate from Jamnagar North, Rivaba Jadeja holds a roadshow in Jamnagar, along with her husband and cricketer Ravindra Jadeja.
As per official EC trends, she is leading with a margin of 50,456 votes over AAP candidate Karshanbhai Karmur. pic.twitter.com/TgnDKGJB9Z
— ANI (@ANI) December 8, 2022
Those who accepted me happily as a candidate, worked for me, reached out & connected to people – I thank them all. It’s not just my victory but of all of us: BJP’s Jamnagar North candidate, Rivaba Jadeja
As per EC’s official trend, she is leading with a margin of 31,333 votes. pic.twitter.com/UglAYQ6kyq
— ANI (@ANI) December 8, 2022
જામનગરના મતદારોને નમ્ર અપીલ!#ભરોસાની_ભાજપ_સરકાર #ભાજપ_આવે_છે #VoteforBJP #જીતશે_જામનગર_ઉત્તર_૭૮ pic.twitter.com/a7Sw1IhAhl
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 29, 2022