ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు.
భారత్-ఆసీస్ మధ్య ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది. ఇక ఈ సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే శుక్రవారం మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ప్రస్తుతం నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు. దాంతో టీమిండియా మ్యాచ్ లో పైచేయి సాధించింది. ప్రస్తుతం జడేజా క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా అదే ఊపుతో వన్డే సిరీస్ ను కూడా నెగ్గాలని భావిస్తోంది. ఇక శుక్రవారం ప్రారంభం అయిన తొలి వన్డేలో ఆసీస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఆదిలోనే షాకిచ్చాడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ సిరాజ్. తన తొలి ఓవర్ చివరి బంతికి ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5)ను బౌల్డ్ చేశాడు. దాంతో 5 పరుగులకే ఆసీస్ మెుదటి వికెట్ ను కోల్పోయింది.
ఆ తర్వాత స్టీవ్ స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు మార్ష్. అయితే 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ను పాండ్యా అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన లబూషేన్ తో జతకలిన మార్ష్.. ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీకి దగ్గరవుతున్న మార్ష్ (81) ను అవుట్ చేశాడు జడేజా. ఆ తర్వాత వెంటనే స్టన్నింగ్ క్యాచ్ తో స్టార్ బ్యాటర్ లబూషేన్ (15)ను అవుడ్ చేశాడు జడ్డూ. ఈ క్యాచ్ ఇన్నింగ్స్ మెుత్తానికే హైలెట్ అని చెప్పొచ్చు. క్యాచ్ కు సంబంధించి వివరాల్లోకి వెళితే.. కుల్దీప్ యాదవ్ 23వ ఓవర్ వేయడానికి రంగలోకి దిగాడు. ఈ ఓవర్ 4వ బంతిని అంచనా వేయడంలో తప్పు చేసిన లబూషేన్ షాట్ కొట్టగా.. బంతి ఎడ్జ్ తీసుకుంది.
దాంతో బంతి గాల్లోకి లేవగా షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న జడేజా ముందుకు డైవ్ చేస్తూ.. అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. దాంతో లబూషేన్ కథ ముగిసింది. ప్రస్తుతం జడేజా పట్టిన క్యాచ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 29 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. క్రీజ్ లో కామెరూన్ గ్రీన్ (26), మాక్స్ వెల్ (3) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. జట్టులో మార్ష్ (81), స్మిత్ (22), జోష్ ఇంగ్లిష్ (26) పరుగులు చేశారు.
Outstanding blinder from Jadeja… Looking in pure form today in the field… #INDvsAUS #Jadejapic.twitter.com/aPJPdE9xSH
— Suryansh (@Suryansh1329) March 17, 2023