టెస్టు క్రికెట్‌ను ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న విధానంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. రావాల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఫ్లాట్ పిచ్‌పై చెలరేగి ఆడింది. వన్డే, టీ20 ఆడుతున్నట్లు.. ఇంగ్లండ్ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో తొలి రోజే 506 పరుగులు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది ఇంగ్లండ్. అదీ కాక.. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీ చేసి.. మరో అద్భుతమైన రికార్డును సృష్టించారు. రెండో రోజు కూడా ఫుల్ అగ్రెసివ్‌గా ఆడిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసింది.
ఒక పాకిస్థాన్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 579 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. ఇక తొలి టెస్టులో ఫలితం తేలదని అంతా భావించారు. కానీ.. టెస్టు క్రికెట్‌లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన ఇంగ్లండ్.. కాస్త రిస్క్ తీసుకుని.. పాక్‌కు 342 పరుగుల ఊరించే లక్ష్యాన్ని ఇచ్చి.. రెండో ఇన్నింగ్స్‌ను 264 పరుగులకే డిక్లేర్ చేసి డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ దూకుడు చూపిస్తామని.. ఇంగ్లండ్ బౌలర్లు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు 268 పరుగులకు ఆలౌట్ చేసి.. 74 పరుగుల తేడాతో తొలి టెస్టులో విజయం సాధించారు. ఫ్లాట్ పిచ్‌పై కూడా ఇంగ్లండ్ అసాధారణ ఆటతో విజయం సాధించడంతో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. ఇంగ్లండ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడినా.. తాము మాత్రం తమ ప్లాన్స్ ప్రకారమే సాంప్రదాయబద్దంగా ఆడతామని పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రకటించాడు.
కానీ.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మాత్రం ఇంగ్లండ్ అగ్రెసివ్ గేమ్‌ను చూసి ఉపఖండపు జట్లు నేర్చుకోవాలని సూచించాడు. మన ఉపఖండపు దేశాల్లో పిల్లలకు క్రికెట్ నేర్పించే క్రమంలో అవుట్ కాకుండా, డిఫెన్స్ ఆడాలని చెబుతూ ట్రైన్ చేస్తుంటారని.. ఆ ధోరణి మారలని అన్నాడు. ఇంగ్లండ్‌తో పోల్చుకుంటే.. టెస్టుల్లో అగ్రెసివ్ గేమ్ ఆడటంలో పాకిస్థాన్ మాత్రమే కాకుండా ఇండియా కూడా వెనుకబడే ఉందని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఇండియా చావు దెబ్బతిన్న విషయాన్ని గుర్తుచేశాడు. అయితే.. ఇంగ్లండ్ చూపిస్తున్న ఇంటెంట్‌ను ఫాలో అవుతూ.. టెస్టుల్లో పాకిస్థాన్ సైతం టీ20 స్టైల్లో ఆడాలని సూచించాడు. కాగా.. పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Ramiz Raja talks about playing T20-style Tests.#PAKvENG | #Cricket pic.twitter.com/qRQ489TT3w
— Grassroots Cricket (@grassrootscric) December 7, 2022