తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చాలా మంది వారసులు ఆరాటపడుతుంటారు. ఇప్పటికే సినిమాలు, ఆటలు, బిజినెస్ లాంటి రంగాల్లో తమ తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని ఎంతో మంది తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా వారతసత్వాన్ని కొనసాగించే రంగాల్లో మెుదటి స్థానంలో ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. ఆ తర్వాత బిజినెస్ తో పాటుగా.. క్రీడల్లో తండ్రుల బాటలో నడుస్తున్నారు వారసులు. ముఖ్యంగా క్రికెట్ లో తమ వారసులను పరిచయం చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ ఇప్పటికే రంజీల్లో ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ ఆటగాడి కొడుకు అండర్-14 జట్టుకు కెప్టెన్ గా నియమితుడైయ్యాడు. అతడు మరెవరో కాదు టీమిండియా వాల్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడు అన్వయ్ ద్రవిడ్.
రాహుల్ ద్రవిడ్.. టీమిండియా వాల్ గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ.. ఆదుకున్నాడు. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక జట్టుకు పలు రకాలుగా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలను దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ద్రవిడ్ కు సంబంధించిన ఓ వార్త క్రీడాలోకంలో వైరల్ గా మారింది. అయితే ఆ వార్త ద్రవిడ్ ది కాదు.. అతడి కొడుకుది. అవును తండ్రికి తగ్గ తనయుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టి దూసుకెళ్తున్నాడు ద్రవిడ్ కొడుకు అన్వయ్ ద్రవిడ్.
Like father, like son.#CricTracker #RahulDravid pic.twitter.com/ZtryNPszHN
— CricTracker (@Cricketracker) January 19, 2023
తాజాగా కర్ణాటక అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీకి జట్టు కెప్టెన్ గా నియమితుడు అయ్యాడు. దాంతో తండ్రి అడుగుజాడల్లోనే కొడుకు కూడా నడుస్తున్నాడు అంటూ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల వారసులు క్రికెట్ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. మరి కర్ణాటక అండర్-14 జట్టుకు ద్రవిడ్ కొడుకు ఎంపిక అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.