యువకులతో నిండిన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సీరీస్ ని సొంత చేసుకున్న టీమ్ ఇండియా, ఇప్పుడు శ్రీలంకతో టీ- ట్వంటీ మ్యాచ్ లు ఆడుతోంది. మొదటి మ్యాచ్ ని సొంతం చేసుకున్న భారత్.. రెండో మ్యాచ్ ని మాత్రం ప్రత్యర్థికి అప్ప చెప్పేసింది. అయితే.., ఈ ఓటమి టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ని బాధించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో ఉన్న యువ క్రికెటర్స్ కి రాహుల్ ద్రావిడ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
శ్రీలంక పర్యటన కుర్రాళ్ళకి మంచి అవకాశం. అయితే.., ఇక్కడ కూడా అందరికీ అవకాశం కల్పించడం కష్టంగా మారింది. కానీ.., కృనాల్ పాండ్యాకి కరోనా సోకడం, ఆ తరువాత మరో తొమ్మిది మంది మ్యాచ్ కి దూరం కావడంతో కుర్రాళ్ళు అందరికీ లెవన్స్ లో ఛాన్స్ వచ్చింది. నిజానికి ఇదో పెద్ద అవకాశం. కానీ.., ప్లేయర్స్ దీనిని సరిగ్గా ఉపయోగించుకోలేదని ద్రావిడ్ సీరియస్ అయ్యారు.
అనుకున్న దాని కంటే ముందే యంగ్ ప్లేయర్లకు చాన్స్ ఇస్తున్నాం. ఒక్కసారి భారత జట్టుకు ఎంపికైతే జట్టులో ఆడటానికి ప్లేయర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉండి తీరాల్సిందే. ఆటగాళ్లను వార్మప్ చేయడం కోసమైతే సెలెక్టర్లు ఎంపిక చేయరు కదా? హాలీడే కోసం పంపలేదు కదా? ప్రతిసారి అవకాశాలు రావు. చాన్స్ ఉన్నప్పుడల్లా ఆటగాళ్లకు టీమ్‌లో చోటు కల్పిస్తాం. వారు తమను తాము నిరూపించుకోవాలి అని ద్రావిడ్ కాస్త కఠినంగానే మాట్లాడారు. దీంతో.. జట్టులో ఉన్న ఆటగాళ్ళకి ఇది ద్రావిడ్ నుండి వచ్చిన స్వీట్ వార్నింగ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., ద్రావిడ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
