టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని ద్రవిడ్ తనకు సూచించినట్లు సాహా మీడియా ముందు బాంబు పేల్చాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సాహాతో పాటు సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను భారత సెలెక్టర్లు పక్కనపెట్టారు. సాహాను తీసుకోకపోవడానికి గల కారణాలను మీడియాకు చెప్పాల్సిన అవసరం తమకు లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నాడు. అది సెలెక్టర్ల అంతర్గత వ్యవహారమని పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన సాహా.. మీడియా ముందుకు వచ్చి ద్రవిడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్‌పై ఆలోచన చేయమని సూచించాడని ఆరోపించాడు. అలాగే కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తన ఆటను ప్రశంసిస్తూ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ జట్టులో చోటుపై హామీ ఇచ్చాడని తెలిపాడు. అయినా తనను పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా అంటే తనకు చాలా గౌరవమని, అతన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో అలా అనలేదని, ఓ కోచ్‌గా సలహా మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశాడు. అందరితో మాట్లాడినట్లే సాహాతో ఆ మాట అన్నానని చెప్పాడు. మరి ద్రవిడ్, సాహా వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahul Dravid suggesting 37 years old Wriddhiman Saha to take retirement, considering his age.
And on the other hand BCCI & Rahul Dravid making 34 years old Rohit Sharma all formats captain.#Saha #BCCI#BCCIPolitics #SouravGanguly pic.twitter.com/qCp3JUHT7G
— Arjit Gupta (@guptarjit) February 19, 2022