ఐపీఎల్ 2023 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ టీమ్ ప్రక్షాళనకు పూనకున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. 2022లోనూ ఆ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ పంజాబ్‌ను వీడి కొత్త ఫ్రాంచైజ్ లక్నోసూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను రిటేన్ చేసుకునేందుకు పంజాబ్ ప్రయత్నించినా రాహుల్ వినకపోవడంతో.. తప్పని పరిస్థితిల్లో మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ కెప్టెన్‌గా నియమించింది. కానీ.. ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మయాంక్ కెప్టెన్సీ ఒత్తిడిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. పోనీ కెప్టెన్సీ అయినా బాగా చేశాడంటే అదీ లేదు. దీంతో 2023 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే.. ఆ టీమ్ తలరాతను మార్చలేకపోయాడు. 2020, 21, 22 మూడు సీజన్లలోనూ పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో పంజాబ్ మేనేజ్‌మెంట్ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోవడంతో.. కుంబ్లేను కోచ్‌గా తప్పించేందుకు కూడా పంజాబ్ కింగ్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే కుంబ్లే స్థానంలో కొత్త కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను తీసుకొచ్చేందుకు పంజాబ్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.
2021 సీజన్‌లో కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లినా.. బ్యాటింగ్‌లో మోర్గాన్ విఫలం అవ్వడంతో కేకేఆర్ మోర్గాన్‌ను వదిలించుకుంది. అలాగే 2022 మెగా వేలంలో మోర్గాన్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఆ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో మోర్గాన్ కోచ్‌గా తీసుకొచ్చేందుకు పంజాబ్ అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: ఏబీ డివిలియర్స్
After coach Anil Kumble, Punjab Kings set to REMOVE Mayank Agarwal as captain, Jonny Bairstow likely to lead;#IPL2023 #PunjabKings #MayankAgarwal #JonnyBairstow https://t.co/RHfoiloR0b
— InsideSport (@InsideSportIND) August 22, 2022
Ahead of #IPL2023, #PBKS have decided to part ways with head coach #AnilKumble and are also considering sacking #MayankAgarwal as captain
Read more:https://t.co/QEiuy3GTCm
— Zee News English (@ZeeNewsEnglish) August 22, 2022