భారత్ క్రికెటర్లు ఒకొక్కరిగా ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి పీటలు ఎక్కగా..తాజాగా రాజస్థాన్ స్టార్ బౌలర్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు.
భారత్ క్రికెటర్లు ఒకొక్కరిగా ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి పీటలు ఎక్కగా..తాజాగా రాజస్థాన్ స్టార్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కర్ణాటక కి చెందిన ప్రసిద్ధ్.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నారు. దేశావాలి క్రికెట్లో అత్యున్నత ప్రదర్శన కనబర్చిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ లో ఆ తర్వాత టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాడు. ఇక భారత తరపున 14 వన్డేలు ఆడిన ఈ యువ పేసర్ 25 వికెట్లు తీసాడు. ఇక 51 మ్యాచులాడిన ప్రసిద్ధ్ కృష్ణ 49 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గాయంతో ఈ సీజన్ ఐపీఎల్ కి దూరంగా ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ.. తన చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్ధం చేసుకుంటున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రసిద్ధ్ కృష్ణ భార్య పేరు రచనా కృష్ణ. ఈమె టెక్నీషియన్ గా పని చేస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన రచన.. అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గురువారం జరిగిన ఈ వేడుకలో వీరిద్దరూ సంప్రదాయ పంథాలో ఏడడుగులు వేశాడు. మంగళవారం పసుపు వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నేడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. చాలా సాధారణంగా జరిగిన ఈ వేడుకలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వెరీ వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్న ప్రసిద్ధ్ కృష్ణ పెళ్లి ఫోటోలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.