అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులు ప్లకార్డులను ప్రదర్శిస్తుంటారు. తమ అభిమాన క్రికెటర్లపై ప్రేమను వాటితో వ్యక్తం చేస్తుంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడిన మ్యాచ్‌ల్లో అతని అభిమానులు ‘వీ ఆర్ మిస్సింగ్ ధోని’ అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. అలాగే విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేయాలని.. ఎప్పుడు ఆ సెంచరీ వస్తుందో అని కోహ్లీ ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించేవారు. ఆసియా కప్ 2022లో కోహ్లీ సెంచరీ చేయడంతో వాటికి పుల్‌స్టాప్ పడింది. ఇక ఐపీఎల్‌లో అయితే.. ఆర్సీబీ కప్పు ఎప్పుడు కొడుతుందో అని, ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ప్లకార్డులు కనిపించేవి. ఆర్సీబీ కప్పు కొట్టేంత వరకు నేను పెళ్లి చేసుకోనని ఒక యువతి ప్రదర్శించిన ఒక ప్లకార్డు ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. ఇప్పుడు తాజాగా.. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన చిన్నారి ఫ్యాన్‌తో ఏకంగా ప్లకార్డ్ చాటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మొదలైంది. తొలి వన్డే ఒవెల్ అడిలైడ్ వేదికగా గురువారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు 288 పరుగుల టఫ్ టార్గెట్ ఇచ్చింది. బదులుగా ఆస్ట్రేలియా కూడా మంచి రిప్లై ఇచ్చినా.. చివర్లో మ్యాచ్ కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది. 86 పరుగులు చేసి వార్నర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకుని అవుటై వచ్చి.. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నాడు. ఆ సమయంలో.. స్టేడియంలో కూర్చోని మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ చిన్నారి ఫ్యాన్.. తనకు వార్నర్ టీ షార్ట్ కావాలని కాగితంపై రాసి(ప్లకార్డ్) పట్టుకున్నాడు. దాన్ని కెమెరా మెన్ ఫోకస్ చేయడంతో.. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న వార్నర్‌తో పాటు ఆసీస్ ఆటగాళ్లు కూడా చూశారు. దీంతో వార్నర్ పక్కనే కూర్చున్న లబుషేన్ కూడా ఆ చిన్నారికి నీ టీషర్ట్ కావాలంట తీసి ఇచ్చేయంటూ వార్నర్‌కు సలహా ఇచ్చాడు.
కొద్ది సేపటికి మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చి కలువు నీకు టీషర్ట్ ఇస్తానని వార్నర్ కూడా బదులు ఇవ్వడంతో ఆ బుడ్డోడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇలా వార్నర్- అతని చిరు అభిమాని మధ్య నడిచిన ప్లకార్డ్ చాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా వార్నర్ టీ షర్ట్‌ను ప్లకార్డ్ చాటింగ్‌తో ఒక బుడ్డోడు అడగ్గా.. మరో ఫ్యాన్ లబుషేన్ టీ షర్ట్ కావాలంటూ ప్లకార్డ్ ప్రదర్శించడంతో.. స్టేడియం మొత్తం నవ్వులు పూసాయి. ఇలా గురువారం నాటి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ప్లకార్డ్ చాటింగ్ హైలెట్‌గా నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(134) సెంచరీ చేశాడు. ఇక ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వార్నర్, ట్రెవీస్ హెడ్, స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
This was a great banter from Warner.pic.twitter.com/ywqxvjmDPG
— Johns. (@CricCrazyJohns) November 17, 2022