పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పీడ్ బౌలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీలుగా పేరుగాంచిన దిగ్గజ బ్యాటర్లను సైతం తన వేగంతో ఇబ్బంది పెట్టాడు అక్తర్. అతని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉన్నా.. ఒక బౌలర్‌గా అక్తర్ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్ నుంచి వచ్చిన స్పీడ్ గన్‌గా అక్తర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదిగాడు. ఇప్పటికీ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డెలవరీ ‘161.3 కిలో మీటర్ పర్ అవర్’ అక్తర్ పేరిటే ఉంది. 2003 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ ఆ ఫాస్టెస్ట్ డెలివరీ సంధించాడు.
2011లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అక్తర్.. ఆ తర్వాత కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే.. క్రికెట్ అభిమానులు మాత్రం అక్తర్ బౌలింగ్‌ను బాగా మిస్ అవుతున్నారు. అక్తర్ లాంటి వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ మళ్లీ వస్తాడో రాడో? అని అనుకుంటున్న వారూ ఉన్నారు. అయితే.. అక్తర్ లాంటి మరో జూనియర్ అక్తర్ పుట్టుకొచ్చాడు. అక్తర్ వేసేంత స్పీడ్ ఇతనిలో లేదుకానీ.. అక్తర్ లాంటి బౌలింగ్ యాక్షన్, హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్‌తో జూనియర్ అక్తర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే యాక్షన్‌తో మళ్లీ అక్తర్ వచ్చి బౌలింగ్ చేస్తున్నాడా? అని అనుమానం కలిగిస్తున్నాడు.. ఒమన్ దేశానికి చెందిన క్రికెటర్ మొహమ్మద్ ఇమ్రాన్. ఒమన్ జాతీయ జట్టుకు ఆడుతున్న ఇమ్రాన్ తన ఆటతో కంటే.. తన బౌలింగ్ యాక్షన్, హెయిర్‌స్టైల్‌తో ఫాపులర్ అయ్యాడు.
అందుకు కారణం అతని బౌలింగ్ యాక్షన్ అచ్చం షోయబ్ అక్తర్‌లానే ఉండటం. బౌలింగ్ వేసే సమయంలో అక్తర్ రన్నప్ స్టైల్‌ను దించేసిన ఇమ్రాన్.. తాజాగా హెయిర్‌స్టైల్‌ను సైతం అచ్చం అక్తర్‌లానే చేయించుకున్నాడు. అక్తర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నసమయంలో లాంగ్ హెయిర్‌తో ప్రత్యేకంగా కనిపించేవాడు. ఇప్పుడు ఇమ్రాన్ సైతం అక్తర్‌లా లాంగ్ హెయిర్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతని బాడీ, ఫేస్ కట్ సైతం అక్తర్‌లానే ఉండటం విశేషం. అయితే.. అక్తర్ బౌలింగ్ యాక్షన్‌తో పాటు అతని స్పీడ్‌ను సైతం అందుకోగలిగితే.. ప్రపంచ క్రికెట్‌లో ఇమ్రాన్‌కు సైతం మంచి అవకాశాలు దక్కుతాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Imran Mohammad or Shoaib Akhtar ?
— Zeeshan Qayyum (@XeeshanQayyum) December 26, 2021