పొట్టి క్రికెట్ సూపర్ హీరో, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు ఘోర అవమానం జరిగింది. అది మరెక్కడో కాదు స్వదేశంలో, అదీ సొంత క్రికెట్ బోర్డు చేతిలోనే జరిగింది. సొంత గడ్డపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్ కు వీడ్కోలు పలకాలి అనుకున్న గేల్ ఆశ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదు. అతని కోరికను, ఆశను విండీస్ బోర్డు బేఖాతరు చేసింది. రానున్న టీ20 సిరీసుల్లో అతడిని ఎంపిక చేయకుండా అవమానించింది. విండీస్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లు ఆడనుంది.
And they didn’t pick @henrygayle even after the games being in Jamaica..#WIvsIRE https://t.co/AgVYS6CNjD
— Cricket Everywhere✍🏻 (@Subhamk79241601) December 31, 2021
అందుకు ప్రకటించిన తాజా జట్టులో క్రిస్ గేల్ పేరు లేదు. సొంత గడ్డపై ఆఖరి టీ20 ఆడి.. వీడ్కోలు పలుకుతానని గేల్ గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గుడ్ బై చెప్పిన గేల్.. విండీస్ బోర్డు నిర్ణయంతో టీ20ల రిటైర్మెంట్ పై మళ్లీ ఆలోచించుకోక తప్పేలా లేదు. ఎందుకంటే సొంత గడ్డపై టీ20 ఆడాలంటే గేల్ ఇంక చాలా కాలం పట్టవచ్చు. లేదంటే అసలు ఆ అవకాశం కూడా దక్కక పోవచ్చు.
Chris Gayle Onslaught vs Zimbabwe in 2015 WC pic.twitter.com/cLvFzOQPmN
— Gayle (@ChrisVideos45) December 28, 2021
మరి అలా అయితే గేల్ కోరిక తీరకుండానే అతను టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలకక తప్పదు. గేల్ తన కెరీర్ లో మొత్తం 452 టీ20 మ్యాచ్లు ఆడాడు. 145.4 స్ట్రైక్ రేట్ తో 14,321 పరుగులు చేశాడు. అంతటి విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్ గేల్ కు సరైన వీడ్కోలు పలికే అవకాశం కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. విండీస్ క్రికెట్ బోర్డు గేల్ విషయంలో కావాలనే అలా ప్రవర్తిస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
No Chris Gayle for Ireland and England T20Is; Jayden Seales added as Reserves.#Windies #WestIndies #WIvsENG pic.twitter.com/O1PtxtSJcU
— Extra Pace (@Extra_Pace) January 1, 2022