అజాజ్ పటేల్ ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్ లో చరిత్ర సృష్టించి రికార్డుల కెక్కిన ఆటగాడు. ఒకే టెస్టు ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసకు చేరాడు. అజాజ్ ముంబైలో అదీ టీమిండియాపై పది వికెట్లు తీయగానే అందరూ టెస్టు క్రికెట్ లో న్యూజిలాండ్ కు స్టార్ స్పిన్నర్ దొరికేశాడు అనుకున్నారు. ఇంక టెస్టుల్లో అజాజ్ ఎక్కడికో వెళ్లిపోతాడు అనుకున్నారు. కానీ, అవేమీ జరగలేదు. ఎన్ని రికార్డులు సాధిస్తే ఏముంది? చివరకు స్వదేశంలో జరిగే టెస్టుకు జట్టులో చోటు కూడా సంపాదించలేకపోయాడు. ఈ విషయం అజాజ్ కే కాదు చాలా మంది క్రికెట్ అభిమానులకు బాధ కలిగించే విషయమే.
New Zealand drop history man Ajaz Patel for Bangladesh Test series
READ: https://t.co/KmfZkH2IQq #AjazPatel #NZvBAN #NZvsBAN pic.twitter.com/RMF7YYsYLP
— TOI Sports (@toisports) December 23, 2021
అజాజ్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై న్యూజిలాండ్ బోర్డు చాలా సింపుల్ గా సమాధానం చెప్పింది. ఘనతలను బట్టి కాకుండా జట్టుకు ఏం కావాలో అలాంటి ఆటగాళ్లనే సెలక్ట్ చేస్తామంటూ ప్రకటించారు. భారత మూలాలున్న ఆటగాళ్లను న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ ఉపఖండం మ్యాచ్ ల కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. తర్వాత మరే మ్యాచ్ లలో వాళ్లు కనిపించరు అనే అభిప్రాయాలు ఉండేవి. అజాజ్ పరిస్థితి చూశాక అది పుకారు కాదు.. నిజమేనేమో అనే భావన కలుగుతుంది. బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు అజాజ్ ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
With Kane Williamson injured, Tom Latham will lead a New Zealand Test side with no specialist spinner at home vs Bangladesh pic.twitter.com/fwjd2iNjcB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 22, 2021
బంగ్లాదేశ్ తో టెస్టుకు న్యూజిలాండ్ ప్రకటించిన జట్టు: ఈ టెస్టు సిరీస్ కు కేన్ మామకు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో టామ్ లేథమ్ ను కెప్టెన్ గా ప్రకటించారు. విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే