గ్రౌండ్ లో తమ ఆటతో హీరోలుగా మారడం పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడినా.. లేకపోతే ఒక్క గ్రేట్ స్పెల్ వేసినా ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. కానీ పేద కళాకారుల కోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని అందరి మనసులని గెలుచుకున్నాడు ప్రస్తుత సన్ రైజర్స్ బౌలర్.
గ్రౌండ్ లో తమ ఆటతో హీరోలుగా మారడం పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడినా.. లేకపోతే ఒక్క గ్రేట్ స్పెల్ వేసినా ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. కానీ మనం సాధించిన దానికి అర్ధం చెబుతూ , అసలైన జీవితానికి నిర్వచనంగా మారుతూ కొంత మంది క్రికెటర్లు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటారు. తాజాగా ఒక క్రికెటర్ గొప్ప మనసు చాటుకొని అందరి మనసులని గెలుచుకున్నాడు. అతడెవరో కాదు ఐపీఎల్ ద్వారా తన ఉనికిని చాటుకున్న సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఈ యార్కర్ల వీరుడు క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాడు.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున తొలి సారి గుర్తింపు తెచ్చుకున్నాడు నటరాజన్. తన యార్కర్లతో బ్యాటర్లని ముప్పు తిప్పలు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో టీమిండియాలో చోటు సంపాదించిన ఈ తమిళనాడు బౌలర్ ఆ తర్వాత గాయం కారణంగా పూర్తిగా తన రిథమ్ ని కోల్పోయాడు. అడపాదపగా కెరీర్ ని నెట్టుకొస్తున్న నటరాజన్.. మళ్ళీ భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తమిళనాడు లోని ఒక గ్రామంలో నటరాజన్ క్రికెట్ అకాడమీ కట్టేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు తమిళనాడు లోని యంగ్ క్రికెటర్ల కోసం కోచ్ గా మారనున్నాడు. నటరాజన్ చేస్తున్న ఈ పనికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బున్నవారు కూడా పేద కళాకారుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ రోజుల్లో నటరాజన్ భవిష్యత్తులో యంగ్ క్రికెటర్ల కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి నటరాజన్ తీసుకున్న ఈ నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.