గ్రౌండ్ లో తమ ఆటతో హీరోలుగా మారడం పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడినా.. లేకపోతే ఒక్క గ్రేట్ స్పెల్ వేసినా ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. కానీ పేద కళాకారుల కోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని అందరి మనసులని గెలుచుకున్నాడు ప్రస్తుత సన్ రైజర్స్ బౌలర్.
ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుపెంచింది. గత సీజన్‌లో తమ జట్టులో ఉన్న స్పీడ్ స్టార్ టీ.నటరాజన్‌ను రూ.4 కోట్లకు మరోసారి దక్కించుకుంది. దీంతో ఉమ్రాన్ మాలిక్‌కు తోడు నటరాజన్ SRH బౌలింగ్ ఎటాక్‌లో చేరాడు. దీంతో ఇప్పటి వరకు SRHలో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తే.. కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్.. వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టీ.నటరాజన్‌లను వేలంలో దక్కించుకుంది. మరి సన్‌రైజర్స్ పిక్‌అప్స్‌పై మీ అభిప్రాయాలను […]