క్రికెట్ లో మిస్టర్ కూల్ అన్న పదానికి చిరునామా మహేంద్ర సింగ్ ధోనీ. భారత మాజీ కెప్టెన్ గా ఎన్నో విజయాలు నమోదు చేశాడు. కపిల్ దేవ్ తర్వాత దేశానికి ప్రపంచ కప్ అందించిన దిగ్గజ ఆటగాడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 16లో చెన్సై సూపర్ కింగ్స్ కు విజయ తీరాలకు చేర్చి.. కప్ ను అందించాడు. ఇప్పుడు ఆయన చేసిన పనికి...
మహేంద్ర సింగ్ ధోని.. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా ఈయనకి అభిమానులు ఉన్నారు. క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు గ్రాండ్ మాస్టర్‌లా ఎత్తులు వేయడంలో ధోనిని మించిన వారు లేరు. కపిల్ తరువాత టీమిండియాకి వరల్డ్ కప్ అందించిన ఘనత, చరిత్ర ఒక్క ధోనికి మాత్రమే సాధ్యం. ఇక తాజాగా కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో ఐపీఎల్ టైటిల్ అందించాడు. 41 ఏళ్ళ వయసులో కుర్రాళ్లతో పోటీ పడుతూ.. ఈ అద్భుతాన్ని సాధించడం నిజంగా చాలా కష్టం. కానీ.. ధోని దీన్ని సులువుగా చేసి చూపించాడు. ఇలా ఎవ్వరికీ అర్ధంకాని, ఎవ్వరి ఆలోచనలకి అందని స్థాయిలో ఉంటాడు కాబట్టే.. భారత క్రికెట్ చరిత్రలో ఆయన స్థాయి అంబరాన్ని తాకింది. ఇంత సాధించిన ధోని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? కార్స్, బంగ్లా, బైక్స్ అబ్బో ఒక రేంజ్‌లో ఉంటుంది కదా?
కానీ.., ధోని అంటే ఇది మాత్రమే కాదు.. ఎదిగే కొద్దీ ఉదిగి ఉండటం, తన మూలలను మరవకపోవడం, పెద్దలపై గౌరవం, దేవుడిపై భక్తి ఇవన్నీ ధోని ప్రత్యేకతలు. తాజాగా దీన్ని రుజువు చేసే ఫోటో ఒకటి బయటకి వచ్చింది.ఐపీఎల్ సీజన్ ముగియడంతో ఆటగాళ్లు అంతా తమ గమ్య స్థానాలను చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది టీమిండియా ప్లేయర్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కోసం ఇంగ్లాండ్ కూడా చేరుకున్నారు. ఇక ధోని కూడా రాంచీకి పయనమయ్యాడు. అయితే.. ముంబయి ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ధోని భగవద్గీత చదువుతూ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మాములుగా ధోని లాంటి సెలబ్రెటీ ఇలా భగవద్గీతని చదవడమే అరుదు.
కానీ.., మహేంద్రుడు మాత్రం ఆ పవిత్ర గ్రంధాన్ని అందరికీ చూపిస్తూ ఫోటో దిగడంతో హిందూ మత గురువులు ధోని గొప్పతనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ డిజిటిల్ యుగంలో యువత భగవద్గీత విలువని, గీతాసారాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ధోని లాంటి వ్యక్తులు చెప్తే ఈ జనరేషన్ వింటుంది. భగవద్గీత గొప్పతనం తెలుసుకుని తమ జీవితాలను ఆనందంగా మార్చుకుంటారు. ఈ కారణంగానే ఇప్పుడు ధోని చేసిన పనికి అందరూ హేట్సాఫ్ అంటున్నారు. కాగా, ఇటీవల ఎడమ మోకాలికి గాయమైన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన వైద్యుని సలహా తీసుకుంటున్నారట. అదే సమయంలో ఆయన భగవద్గీత పట్టుకుని కనిపించారు. మరి.. ఆయన చేసిన ఈ పని విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.