కామన్వెల్త్ క్రీడల్లో రెండోరోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. ఈ నాలుగు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను 49 కిలోల వెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా.. అంతకుముందు సంకేత్ మహదేవ్, గురురాజ పూజారి వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఇక చివరిగా 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి కూడా సిల్వర్ మెడల్ సాధించారు. బింద్యారాణి కేవలం ఒక కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించినా.. పతకం గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షూ కొనలేని స్థితి నుంచి మెడల్ గెలిచే స్థాయికి..
మణిపూర్‌కు చెందిన బింద్యారాణి చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, ఇప్పుడు కామన్వెల్త్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చానుతో కలిసి ఒక అకాడమీలో బింద్యారాణి ప్రాక్టీస్ చేశారు. మీరాబాయి తనకు స్ఫూర్తి అని బింద్యా చాలా సార్లు వెల్లడించారు. అందుకే అందరూ బింద్యారాణిని మీరాబాయి చాను 2.ఓ అని పిలుస్తుంటారు. ట్రైనింగ్, టెక్నిక్ విషయంలో మీరాబాయి తనకు ఎన్నో సలహాలు ఇచ్చారని, నా విజయానికి ఆమె ఎంతో దోహదపడ్డారని బింద్యారాణి తెలిపారు.
Imphal | I feel happy & content. Even though she missed gold medal, she put in efforts to get second place. I’ll tell her to work harder for a gold medal next time. Hope she reaches Olympics: S. Ibemcha Devi, mother of weightlifter Bindyarani Devi who won silver medal in CWG pic.twitter.com/qv4am7sQuW
— ANI (@ANI) July 31, 2022
అలాగే ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చిన కొత్తలో మీరాబాయి తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారని నా దగ్గర షూ కొనేందుకు డబ్బులు లేవని తెలుసుకుని.. మీరాబాయి చాను తన షూ కూడా ఇచ్చారని బింద్యారాణి పేర్కొన్నారు. ఇలా ఒక ఛాంపియన్ మరో ఛాంపియన్‌కు ఎంతో మద్దతుగా నిలిచారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
Birmingham, UK | I’m very happy to get a #silver in the first time of playing #CWG. Today was my life’s best performance… gold slipped out of my hand; when I was at podium, I wasn’t at the center; will do better next time: Indian weightlifter Bindyarani Devi on winning a silver pic.twitter.com/E1DEOmEFIO
— ANI (@ANI) July 30, 2022