ప్రతిష్టాత్మక ఎఫ్-1 రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్‌లో ఒక కారు మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైఖేల్ షుమాకర్ అల్లుడు డేవిడ్ షుమాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నుముక విరిగిపోయినట్లు సమాచారం. అయితే వెన్నుముకకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేకున్నా.. కొన్ని వారాలపాటు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ దుర్ఘటన హాకెన్‌హీమ్ డీటీఎమ్ రేసు సందర్భంగా చోటు చేసుకుంది. రేసులో భాగంగా లాప్-6 జరుగుతున్న సమయంలో టర్న్8 వద్ద షుమాకర్ మెర్సిడిస్ కారు మరో రేసర్ కారును ఢీకొట్టింది.
దీంతో షుమాకర్ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. షుమాకర్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు వెన్నుముక కింది భాగంలో ఫ్యాక్ఛర్ అయినట్లు నిర్ధారించారు. డేవిడ్ షుమాకర్‌కు ప్రమాదం జరగడంపై మైఖేల్ షుమాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎఫ్-1 రేసులో 7 వరల్డ్ టైటిల్స్ గెలిచిన మైఖేల్ ఫార్ములావన్ రేసులోనే దిగ్గజంగా ఎదిగాడు. 2013లో మైఖేల్ కూడా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. ఏడాది తర్వాత కోమా నుంచి బయటికొచ్చిన మైఖేల్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివాసం ఉంటున్నాడు. మామ బాటలోనే ఎఫ్-1 రేసర్‌గా కెరీర్ ఆరంభించిన డేవిడ్ షుమాకర్ ఇలా చిన్న ప్రమాదంతో బయటపడ్డాడు.
Michael Schumacher’s nephew left with fractured vertebra after horrifying German touring car crashhttps://t.co/x8mw1e7vYw
— talkSPORT (@talkSPORT) October 13, 2022
#DTM | Michael Schumacher´s nephew David Schumacher (20 yo) has been diagnosed with a broken lumbar vertebra 🏥 following a scary accident 💥 during the final round of the 2022 DTM season last Saturday at Hockenheim 🇩🇪.
📸 Unknown pic.twitter.com/v1vaJHHD4g— MatraX Lubricants (@MatraxRacing) October 13, 2022