ప్రపంచ క్రికెట్ లో ‘ఐపీఎల్’ ప్రస్థానం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటి నుంచి టీ20 ఫార్మాట్ కు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అన్ని దేశాలు స్వతహాగా టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెట్టేశాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చాలానే పుట్టుకొచ్చాయి. ఇదే తరహాలో యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఆయా జట్ల పేర్లు, ఆటగాళ్ల ఎంపిక దాదాపు పూర్తవుగా, ఇప్పుడు కోచ్ ల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు.
వచ్చే ఏడాది జనవరి 6న యూఏఈ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. అబుదాబి నైట్ రైడర్స్, డెసర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్.. ఇలా 6 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఒక్క ‘డెసర్ట్ వైపర్స్(మాంచెస్టర్ యునైటెడ్ కు చెందిన లాన్సర్ క్యాపిటల్స్)’.. మినహా మిగిలిన 5 జట్లకు భారతీయులే యజమానులుగా ఉన్నారు. ఇప్పటికే.. ఆయా జట్ల ఆటగాళ్ళు, కోచ్ లు, స్టాఫ్ మెంబెర్స్ ఎంపిక దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు. రిలయన్స్ సారధ్యంలోని ముంబై ఎమిరేట్స్ జట్టు ఈ ప్రకటన చేసింది.
MI Emirates appoint Shane Bond as head coach, former Mumbai Indians’ players Parthiv Patel and Vinay Kumar also in coaching staff
More 👉 https://t.co/EYWTNbFbuQ#ILT20 #MIEmirates #ShaneBond #ParthivPatel pic.twitter.com/fdMuZ8zvqg
— InsideSport (@InsideSportIND) September 17, 2022
అలాగే.. జట్టు ప్రధాన కోచ్ గా షేన్ బాండ్, బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్, ఫీల్డింగ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ను నియమించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. “ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్ కుమార్ లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు”. బ్యాటింగ్ కోచ్ గా పార్థివ్ పటేల్.. సరైన ఎంపిక అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘MI Emirates’ announces squad for the inaugural edition of UAE’s International League T20.
(📸Credit: BCCI/IPL)#MIemirates #OneFamily #mumbaiindians #T20League #Cricket pic.twitter.com/MJNTT8HuWL
— SportsTiger (@sportstigerapp) August 12, 2022