మరికొద్ది రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాలో అడుగుపెట్టబోతుంది ఆస్ట్రేలియా జట్టు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే ఫైనల్ చేరింది ఆసిస్. ఇక వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. ఇరు జట్లు సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఇక టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసమే టీమిండియా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ వస్తోంది. ఆసిస్ పై టెస్ట్ సిరీస్ గెలిచి నెంబర్ వన్ స్థానంతో పాటుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఛానల్ తో మాట్లాడాడు ఆసిస్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్. ఈ సిరీస్ లో ఆ టీమిండియా ఆటగాడిని ఎదుర్కొవడమే మా ముందున్న అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు.
బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆసిస్ తో ఆడనుంది. ఫిబ్రవరి 9వ తారిఖు నుంచి ఈ సిరీస్ ఆరంభం కాబోతోంది. ఈ క్రమంలోనే సిరీస్ పై స్పందించాడు ఆసిస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్. ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ..”టీమిండియా జట్టులో అత్యంత ప్రమాదకర ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడిని ఎదుర్కోవడమే మా ముందున్న అతి పెద్ద సవాల్. ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ కి అతడిని ఎదుర్కొవడం మా వల్ల కాదేమో. అయితే ప్రస్తుతం మా జట్టు కూడా అత్యంత పటిష్టంగా ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య పోటీ గొప్పగా ఉండబోతోంది. ఇక మాపై గత సిరీస్ లో అద్భుతంగా రాణించిన రిషభ్ పంత్ యాక్సిడెంట్ కు గురి కావడం బాధాకరం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని స్టోయినిస్ పేర్కొన్నాడు.
Stoinis (in ANI) said “Virat Kohli could be the biggest threat for Australia in the Test series”.
— Johns. (@CricCrazyJohns) January 28, 2023
కోహ్లీ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని ఎదుర్కొవడానికి మేం ప్రత్యేకంగా పథకాలు రచిస్తున్నాం అని స్టోయినిస్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ లో స్పిన్ ను ఎదుర్కొని భారీ స్కోర్లు రాబట్టడం అంత సులువు కాదని స్టోయినిస్ అన్నాడు. ముఖ్యంగా అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం మాకు పెద్ద చాలా కష్టమే అని ఈ సందర్భంగా స్టోయినిస్ పేర్కొన్నాడు. అదేవిధంగా రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని, తాము అతడిని మిస్ అవుతున్నామని ఈ సందర్భంగా తెలిపాడు. మరి మార్కస్ స్టోయినిస్.. విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.