క్రికెట్ ని ఓ మతంగా భావించే దేశం ఇండియా. ఇక్కడ క్రికెటర్స్ కి ఉండే ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఇందుకే తమ అభిమాన క్రికెటర్స్ ఆన్ ఫీల్డ్ లో ఉన్నా, ఆఫ్ ఫీల్డ్ లో ఉన్నా వారి గురించి తెలుసుకుపోవడానికి ఫ్యాన్స్ ఆత్రుత పడుతూ ఉంటారు. ఇలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్స్ లో ధోని ముందు వరుసలో ఉంటాడు. టీమ్ ఇండియాకి సరైన కీపర్ లేని రోజుల్లో.. గంగూలీ ప్రోత్సాహంతో టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ధోని. అక్కడ నుండి ధోనికే కాదు, ఇండియన్ క్రికెట్ టీమ్ కి కూడా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయ్యింది.
ధోని కెప్టెన్ అయ్యాక టీమ్ ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. కానీ.., లాస్ట్ వరల్డ్ కప్ తరువాత మహేంద్ర టీమ్ ఇండియా నుండి పూర్తిగా రిటైర్డ్ అయిపోయాడు. మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నా అవి ధోని ఫ్యాన్స్ కి పూర్తి తృప్తిని కలిగించడం లేదు. ధోని మిగతా క్రికెటర్స్ లా బటయట పెద్దగా కనిపించదు. మ్యాచ్ లు లేని సమయంలో ఈ మిస్టర్ కూల్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు.
ఇక ఐపీఎల్ 2021 మిగతా సగం టోర్నీకి ఇంకా కాస్త సమయం ఉండటంతో ధోని ఫ్రెండ్స్ తో చిలీ అవుతున్నాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ టూర్ ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న మాహీ.. రాంచీలోని తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గ్యారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైంపాస్ చేశాడు. ఈ సమయంలో తీసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో నెరిసిన గడ్డంతో నవ్వుతూ, ధోని కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో.., న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి.. ధోని కొత్త లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.