Legends League Cricket 2022: భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజాని అందిస్తోంది. టీ20ల్లో సెంచరీ చూడడమే అరుదు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. వయసు మళ్ళినా మాజీ క్రికెటర్లు మాత్రం తమలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అలాంటి ఉత్కంఠభరిత మ్యాచుల నడుమ అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. ఆ వివరాలు..
మిచెల్ జాన్సన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే.. ఆ జట్టు తొలి మ్యాచులో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలై, రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న లక్నో వేదికగా జరగనుంది. ఇప్పటికే.. ఆటగాళ్లందరూ లక్నో చేరుకొని వారి వారి హోటల్ గదుల్లో సేద తీరుతున్నారు. ఈ తరుణంలో మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. అందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. “ఇది ఎలాంటి పాము? ఎవరికైనా తెలుసా ??” అంటూ కాప్షన్ జత చేశాడు.
చూడడానికి, అది చిన్న పిల్లలా ఉన్నా.. ఆటగాళ్లుండే 5 స్టార్ హోటళ్లలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన జరిగింటే.. ఇండియాలో ఆటగాళ్లకు రక్షణ లేదు అని నిందించేవారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చూడాల్సిన భాద్యత.. ఆయా హోటళ్లతో పాటు నిర్వాహకులపై కూడా ఉంటుంది. ఇక, ఇండియా క్యాపిటల్స్ తదుపరి మ్యాచులో భిల్వారా కింగ్స్ ను ఢీకొట్టనుంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.