ఐసీసీ క్వాలిఫయర్స్ లో పసికూనపై విండీస్ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. తొలుత బౌలింగ్ లో ఒమాన్ జట్టుని 221 పరుగులకే కట్టడి చేసింది. ఇదిలా ఉండగా ఒమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని ఒక స్టన్నింగ్ డెలివరీ నమోదు కావడం విశేషం.
ఐసీసీ క్వాలిఫయర్స్ లో భాగంగా ప్రస్తుతం వెస్టిండీస్- ఒమాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచులో ఇప్పటికే ఈ రెండు జట్లు వరల్డ్ కప్ కి అర్హత సాధించకుండానే ఇంటి ముఖం పట్టాయి. ఇక నామమాత్రంగా జరిగే ఈ మ్యాచులో విండీస్ జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుంది. వరుసగా మూడు మ్యాచులు పసికూనల చేతిలో పరాజయం పాలైన విండీస్ ఒమాన్ పై విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా ఒమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని ఒక స్టన్నింగ్ డెలివరీ నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ బంతి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఐసీసీ క్వాలిఫయర్స్ లో పసికూనపై విండీస్ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. తొలుత బౌలింగ్ లో ఒమాన్ జట్టుని 221 పరుగులకే కట్టడి చేసింది. షోయబ్ ఖాన్ (50), సూరజ్ కుమార్(53) అర్ధ సెంచరీలతో రాణించారు. ఒమాన్ బ్యాటింగ్ చేస్తుండగా కైల్ మేయర్స్ వేసిన 7 వ ఓవర్లో చిన్నపాటి అద్భుతమే చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి బంతి అనూహ్యంగా ఇన్ స్వింగ్ తిరిగింది. దాదాపు 3.6 డిగ్రీలు తిరిగిన ఈ ఇన్ స్వింగ్ డెలివరీకి ఒమాన్ కెప్టెన్ అకేబ్ లేయాస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఒక మీడియం పేవర్ కి ఇంతలా స్వింగ్ తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఛేజింగ్ లో విండీస్ నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 32 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ హోప్, ఓపెనర్ బ్రాండన్ కింగ్ ఉన్నారు. మరి మేయర్స్ వేసిన ఈ ఇన్ స్వింగ్ డెలివరీకి మీరు కూడా చూసేయండి.