టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యా తండ్రైయ్యాడు. అతని భార్య పంకూరి శర్మ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. పంకూరి శర్మ అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకోగా.. ఆమె పక్కన తాను ఉండి బాబును చూస్తున్న ఫోటోను కృనాల్ షేర్ చేశాడు. తన కొడుకుకు కవిర్ కృనాల్ పాండ్యా పేరు పెట్టినట్లు తెలియజేశాడు.
కొన్నాళ్ల పాటు పంకూరి శర్మతో డేటింగ్ చేసిన కృనాల్.. 2017 డిసెంబర్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల టైంలో పంకూరి తరచుగా స్టేడియంలో కనిపించేది. స్టాండ్స్‌లో కూర్చుని కృనాల్‌ను ఎంకరేజ్ చేసేది. కృనాల్ పాండ్యా చివరిసారిగా 2021 జులైలో శ్రీలంక పర్యటనలో టీమిండియా తరఫున ఆడాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కృనాల్ టీమిండియా తరఫున 5 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కృనాల్ బ్యాటింగ్లో 183పరుగులు, బౌలింగ్లో 10వికెట్లు తీసి రాణించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo
— Krunal Pandya (@krunalpandya24) July 24, 2022