జస్ట్ మిస్... కోహ్లీ డబుల్ సెంచరీ ఛాన్స్ చేజేతులా మిస్ అయిపోయింది. అశ్విన్ అలా చేయకుండా కాస్త క్రీజులో స్టాండింగ్ ఇచ్చి ఉంటే మాత్రం కోహ్లీ పేరిట సరికొత్త రికార్డులు నమోదయ్యేవి. ఇంతకీ ఏం జరిగింది?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసే సదావకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. అయితే ఇన్నిరోజుల నుంచి టెస్టు సెంచరీ ఎప్పుడు ఎప్పుడు అని ప్రశ్నించి అందరి నోళ్లు మూతపడేలా బ్యాటుతో దడ పుట్టించిన కోహ్లీ.. ఒకానొక దశలో చాలా సులభంగా డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ అశ్విన్ చేసిన పొరపాటు వల్ల ఆ మార్కుని అందుకోకుండానే కోహ్లీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ అభిమానులు అశ్విన్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చకు దారితీసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు దగ్గర ఆలౌటైంది. దీంతో టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారు? ఏంటి అనే సందేహాలు వచ్చాయి. దీనికి సమాధానంగా గిల్(128) సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మిగతా బ్యాటర్లలో కోహ్లీ(186) ఆకట్టుకునే ప్రదర్శన చేయగా, అక్షర్ పటేల్ తనదైన హాఫ్ సెంచరీతో మెప్పించాడు. ఈ క్రమంలోనే భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగుల వద్ద ఆలౌటైంది. 91 రన్స్ ఆధిక్యం సంపాదించింది.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన కోహ్లీ.. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మన జట్టు అబేధ్యమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే టెయిలెండర్స్ లో మిగతా వాళ్లతో పోలిస్తే అశ్విన్ స్టాండింగ్ ఇవ్వగలడు. కానీ అలా చేయకుండా క్రీజు బయటకొచ్చి బౌండరీలు కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్, లయన్ బౌలింగ్ లో ఔటైపోయాడు. ఒకవేళ అశ్విన్ క్రీజులో నిలబడి స్టాండింగ్ ఇచ్చుంటే డబుల్ సెంచరీ చేసేవాడేమో. కానీ అలా జరగలేదు. దీంతో కోహ్లీ డబుల్ చేయకుండానే ఔటైపోయాడు. ఫలితంగా టీమిండియా మంచి స్కోరు దగ్గరే ఆలౌటైపోయింది. మరి నిర్ణయాత్మక ఈ టెస్టు ఫలితం ఏంటనేది చూడాలి. కోహ్లీ డబుల్ మిస్ కావడానికి అశ్విన్ కారణమనే దానిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
That R Ashwin Wicket Might Have Cost Virat Kohli His Double Century.
Would Have Been 1st Against Australia For Him #INDvAUS #INDvsAUSTest #BGT2023
— Mayank Thakur (@MayankT45150336) March 12, 2023