ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన రెండు వన్డేల్లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ టూర్ కు ముందు కేఎల్ రాహుల్ కు కరోనా సోకింది. దీంతో అతను క్వారంటైన్ కు వెళ్లాడు. తాజాగా అతన్ని పరిశీలించిన వైద్య బృందం అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని సూచించింది. దీంతో అతను వెస్టిండీస్ తో జరిగే 5 టీ20లకు అందుబాటులో ఉండడంలేదని యాజమాన్యం తెలిపింది.
కేఎల్ రాహుల్ గతంలో గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కూ దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో అతన్ని వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే అతనికి కరోనా సోకింది. ఇప్పటికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు విండిస్ చేరుకున్నారు. కానీ రాహుల్ ఇంకా ఇక్కడే ఉన్నాడు. దీంతో ఇక అతడు టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండడు అని జట్దు యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే రాహుల్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పోచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 KL Rahul is unlikely to travel to the West Indies for the upcoming #WIvIND T20I series
ESPNcricinfo understands that he has been advised one more week’s rest and recuperation by BCCI’s medical professionals
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2022