ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. అయితే మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 1-2తో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ.. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను వైట్‌వాష్ చేసేందుకు రెండో టెస్టు కోసం సిద్ధమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో జరిగిన మార్పులపై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదేం కెప్టెన్సీ అంటూ క్రికెట్ అభిమానులు రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడేందుకు కారణం.. కుల్దీప్ యాదవ్‌ను రెండో టెస్టులో ఆడించకపోవడమే. తొలి టెస్టులో మొత్తం 8 వికెట్లతో పాటు 5 వికెట్ల హాల్ సాధించిన కుల్దీప్ యాదవ్‌ను రెండో టెస్టులో పక్కన పెట్టడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన కుల్దీప్ 8 వికెట్లతో పాటు బ్యాటింగ్ 40కి పైగా పరుగులు సైతం చేసి.. తొలి టెస్టుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అలాంటి ప్లేయర్‌ను రెండో టెస్టులో బెంచ్‌కే పరిమితం చేయడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు సైతం కెప్టెన్ రాహుల్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
గతంలో కూడా కుల్దీప్ యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని.. మంచి ప్రదర్శన చేస్తున్నా.. జట్టులో స్థానం కల్పించకుండా పక్కన పెట్టేవారని, ఇప్పుడు ఏకంగా తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచినా.. రెండో టెస్టులో ఆడించకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. పిచ్ పరిస్థితుల కారణంగానే కుల్దీప్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని.. పిచ్‌లో కాస్త బౌన్స్ లభిస్తుందని భావిస్తున్నట్లు అందుకే అదనంగా ఒక పేసర్‌తో బరిలోకి దిగుతున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు. కానీ.. తొలి టెస్టులో విఫలమైన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లను కొనసాగిస్తూ.. జట్టులో ఉన్న ఒకే ఒక లెగ్ స్పిన్నర్‌ను పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అశ్విన్, అక్షర్ ఒకే విధమైన బౌలర్లు, పైగా పిచ్‌లో బౌన్స్ ఉన్నా.. అది పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుంది. అయినా కూడా కుల్దీప్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Story of Kuldeep Yadav: Player of the match in first Test but no place in second Test, feel for him especially after returning to the team after 22 months.
— Johns. (@CricCrazyJohns) December 22, 2022
Player of the match in the first Test, Kuldeep Yadav dropped from the second Test.
Your views?#BANvIND pic.twitter.com/iqcNDbw4c6
— CricTracker (@Cricketracker) December 22, 2022