ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఐపీఎల్లో తిరిగి ఆడటంపై అతను స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఒమాన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభమైంది. ఇందులో మాజీ క్రికెటర్లు మూడు జట్లు (ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్, ఆసియా లైయన్స్) గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు.
ఇది కూడా చదవండి : బిగ్ బాష్ లీగ్ లో విచిత్రం. ఆఖరి బంతికి అదిరిపోయే డ్రామా!
ఈ సందర్భంగా అల్ అమెరాత్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వరల్డ్ జెయింట్స్, ఆసియా లైయన్స్ జట్లు తలపడ్డాయి. ఆసియా జట్టు నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని.. వరల్డ్ జెయింట్స్ చేధించింది. వరల్డ్ జెయింట్స్ తరపున ఆడుతున్న పీటర్సన్ 226 స్ట్రైక్ రేట్ తో 38 బంతుల్లో 86 పరుగులు (7×6, 9×4) చేశాడు. పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్ తో వరల్డ్ జెయింట్స్ జట్టు 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
#AboutLastNight if you have a minute! 💫 pic.twitter.com/ezIMu8XNeo
— Kevin Pietersen🦏 (@KP24) January 27, 2022
మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ వీడియోను పీటర్సన్ ట్విటర్లో పోస్టు చేయగా.. భారత క్రికెటర్ శ్రీవాత్సవ గోస్వామి స్పందించాడు. ఈ ఇన్నింగ్స్ చూసి మళ్లీ ఐపీఎల్లో ఆడాలంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీనికి ప్రతిస్పందించిన ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్. ‘నేను ఐపీఎల్ ఆడితే భారీ ధర పలుకుతా. అలాగే టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది. అది ప్రస్తుత ఆటగాళ్లకు అవమానభారంగా మిగిలిపోతుంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు.ఈ ఫన్నీ కామెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
I’d be too expensive and would probably end up being the top scorer in the league. It would embarrass all the modern day players! 🤣
— Kevin Pietersen🦏 (@KP24) January 27, 2022