వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ జాన్ కాంప్‌బెల్‌ను క్రికెట్ నుంచి నాలుగేళ్ల పాటు నిషేధించారు. డోపింగ్ టెస్టు కోసం రక్తనమూనాలు ఇవ్వని కారణంగా.. అతను డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయినట్లు నిర్ధారిస్తూ.. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లఘించాడనే ఆరోపనలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జాన్ కాంప్‌బెల్ నుంచి రక్ల నమూనాలు సేకరించేందుకు వెళ్లిన బృందానికి జాన్ సహకరించకపోవడం, బ్లడ్ స్యాంపిల్స్ ఇవ్వకుండా తిరస్కరించడంతో.. అతనిపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల కమిటీ జాన్‌పై 4 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. ఈ యాంటీ డోపింగ్ నిబంధనలను జాన్ కాంప్‌బెల్ ఉద్దేశపూర్వకంగా ఉల్లఘించడం లేదని కమిటీ నమ్ముతూ.. అతనిపై కేవలం నాలుగేళ్ల నిషేధం మాత్రమే విధించింది. జాన్ కావాలని యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఉంటే అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకునేవారు. ఈ నాలుగేళ్ల నిషేధం మే నుంచే అమల్లోకి వస్తుందని కమిటీ వెల్లడించింది. కాగా.. వెస్టిండీస్ తరపున జాన్ కాంపెబెల్.. ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడి 888 పరుగులు సాధించాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 6 వన్డేల్లో 248 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. ఇక విండీస్ తరఫున 2 టీ20 మ్యాచ్‌లు ఆడిన జాన్.. 11 పరుగులు మాత్రమే చేశాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జాన్ కాంప్‌బెల్ ఇంతలోనే నిషేధానికి గురయ్యాడు.
West Indies batsman John Campbell has been slapped with a 4 year ban for “evading, refusing or failing to submit to sample collection by JADCO on April 20, 2022.
The decision, a copy seen by TVJ Sports, came Friday evening from the Independent Anti-Doping
Disciplinary Panel. pic.twitter.com/z8bkWMFGXf— Kayon Raynor (@kayraynor) October 8, 2022