టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023కు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022కు దూరమైన ఈ స్పీడ్‌స్టర్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2023లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. కాగా.. ఇప్పటికే ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ చాలా మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. తక్కువ మంది ఆటగాళ్లను రిటేన్ చేసుకుంది. రిటేన్ చేసుకున్న లిస్ట్‌లో బుమ్రాతో పాటు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ.. గాయాల కారణంగా జాతీయ జట్లకు దూరం అయ్యారు. అయితే.. ఐపీఎల్‌కు మరింత సమయం ఉండటంతో గాయాల నుంచి పూర్తిగా కోలుకుని.. ఫుల్ ఫిట్‌నెస్‌తో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఏకంగా 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కానీ.. ఐపీఎల్ 2022లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. దీంతో ఐపీఎల్ 2023 కోసం పటిష్టంగా బరిలోకి దిగాలని ముంబై బలంగా ఫిక్స్ అయింది. అందుకోసమే.. ఏకంగా 13 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసి.. మినీ వేలంలో బెస్ట్ ప్లేయర్లను తీసుకునేందుకు రెడీ అయింది. అయితే.. జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నా.. వారిని మాత్రం రిటేన్ చేసుకుంది. ఐపీఎల్‌కు మరో మూడు నెలల సమయం ఉండటంతో వారిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారని ముంబై ఆశిస్తుంది. అయితే.. ఆర్చర్ మరో నెల రోజుల్లోనే పూర్తిగా కోలుకుని ఇంగ్లండ్ జట్టులో చేరనున్నాడు.
కాగా.. టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి గాయం కారణంగా బుమ్రా తప్పుకోవడంపై క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో నిర్విరామంగా రెండు నెలల పాటు 14, 16 మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లు జాతీయ జట్టుకు అందులోనూ వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టత్మక టోర్నీలను సైతం చిన్నచూపు చూసి తప్పుకుంటున్నారని ఆరోపించారు. అలాగే బుమ్రా జట్టులో లేని లోటు వరల్డ్ కప్‌లో స్పష్టంగా కనిపించింది. సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. జట్టులో బుమ్రా ఉంటే కచ్చితంగా పరిస్థితి మెరుగ్గా ఉండేదని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్‌కు గాయం నుంచి తప్పుకున్న బుమ్రా ఇప్పుడు ఐపీఎల్‌కు రెడీ అవుతున్నాడనే వార్తలపై కూడా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mumbai Indians set to have both Bumrah and Jofra in IPL 2023. (Source – Cricbuzz)
— Johns. (@CricCrazyJohns) November 18, 2022
Want Mumbai Indians to trade Jasprit Bumrah to the Indian team. 😍#IPL2023
— Himanshu Pareek (@Sports_Himanshu) November 14, 2022
JOFRA ARCHER + JASPRIT BUMRAH & DEWALD BREVIS + TIM DAVID in #IPL2023 for Mumbai Indians!!🤯🤯
Comeback ⌛ pic.twitter.com/CuT7wkvmhC
— CricTracker (@Cricketracker) November 15, 2022