మన ఒంటిని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద విషయమూ కాదు, విశేషము కాదు. కానీ.. కొన్ని వేల మంది గుమ్మిగూడి, విచ్చలవిడిగా చెత్తను పడేసి వెళ్లిపోయిన తర్వాత.. ఆ గుంపులో ఒకరిగా వినోదం పొందినంతసేపు పొంది.. అందరూ వెళ్లిపోయిన తర్వాత.. అక్కడ పడున్న చెత్తనంతా ఏరేసి.. ఆ ప్రాంతాన్ని మళ్లీ శుభ్రం చేస్తే.. నిజంగా గొప్ప విషయమే. కానీ.. అలా చేసే వాళ్లు ఉన్నారా అంటే? కష్టమే.. అనే సమాధానం మన నుంచి వస్తుంది. కానీ.. ఉన్నారు..! తమ పని కాకపోయినా.. ఆటను ఆస్వాదించిన చోటును శుభ్రంగా ఉంచాలనే ఇంకితం ఉండే వారునున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఆ దేశస్థులంతా అంతే. చెత్త కనపడితే.. పడేసింది ఎవరని ఆలోచించకుండా, మనకెందుకులే అని వదిలేయకుండా.. స్వయంగా వాళ్లే తీసుకెళ్లి చెత్త డబ్బాలో వేస్తారు. అలా చేస్తున్నారంటే.. వాళ్లు కచ్చితం జపాన్ దేశస్థులే.
పరిశుభ్రత విషయంలో ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించే దేశంగా ఉన్న జపానీస్ వారు.. తాజాగా మరోసారి తమ అందరి అభినందనలను అందుకుంటున్నారు. ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో తొలి రోజు ఖతర్-ఈక్వెడార్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కొన్ని వేల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానుల ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మ్యాచ్ చూస్తూ.. కూల్ డ్రింక్స్, స్నాక్స్ కూడా ఫుల్‌గా లాగించారు. కానీ.. వాటి వ్యర్థాలను ఎక్కడే పడేశారు. మ్యాచ్ ముగిశాక.. వెనుకా ముందు దులుపుకోని వెళ్లిపోయారు.
అంతసేపు జనసంద్రంగా ఉన్న స్టేడియం అంతా వెళ్లిపోయిన తర్వాత చెత్త డంప్‌యార్డ్‌గా మారిపోయింది. చెల్లా చెదురుగా వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు పడి ఉన్నాయి. ఇదంతా చూసిన జపాన్ దేశస్థులు.. వాలెంటరీగా తమ చుట్టుపక్కల ఉన్న చెత్తనంత ఏరి డస్ట్ బీన్స్‌లో వేశారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రతి జపనీస్ కూడా.. ఇలాగే చేయడం విశేషం. అందరిలానే వేల రూపాయాలు పెట్టి టిక్కెట్ కొని మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారు.. మ్యాచ్ తర్వాత వెళ్లిపోవచ్చు కానీ.. శుభ్రతపై వారికున్న అవగాహన వారిని అలా వెళ్లనివ్వలేదు. అలా అని మిగతా వారిపై కూడా ఫిర్యాదులు చేయలేదు. దర్పం చూసిస్తూ.. అక్కడుంటే పనివారికి చెత్త క్లీన్ చేయమని అజమాయిషీ చెలయించలేదు. కామ్‌గా.. సంజులు తీసుకుని అక్కడున్న చెత్తనంత ఏరేసి.. స్టేడియాన్ని శుభ్రంగా మార్చారు. ఇదంతా ఒక్కడే ఉన్న ఒక య్యూటూబర్ వీడియో తీసి సోషల్ మీడియాను పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి క్రమశిక్షణ ఉండటంతోనే రెండు అణుబాంబులు పడినా.. జపాన్ కోలుకుని ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో ఒకటిగా ఎదిగిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.