టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ అంచనాలకు తగ్గట్లే కెరీర్ ఆరంభంలో అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టుల్లో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో పలు అపూర్వమైన విజయాలను అందించాడు. ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే పంత్.. తన బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయే టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు నుంచే ఫామ్ కోల్పోయిన పంత్‌ను.. కేవలం ఒక లెఫ్ట్ హ్యాండర్ జట్టులో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నారు. కానీ.. పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. సూపర్ 12లో జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చినా పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇక సెమీస్‌లోనూ అవకాశం ఇస్తే.. హార్దిక్ పాండ్యా కోసం తన వికెట్ త్యాగం చేశాడు. ఇలా వరల్డ్ కప్‌కు ముందు, వరల్డ్ కప్‌లో ఫూర్ ఫామ్‌లో కొనసాగిన పంత్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సైతం ఎంపిక చేశారు. కానీ.. జట్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు ఉండటంతో పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని అంతా భావించారు. కానీ.. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం పంత్‌పై నమ్మకం ఉంచి.. అతన్ని ఏకంగా ఓపెనర్‌గా బరిలోకి దింపాడు. అయినా కూడా పంత్ పరుగులు చేయలేకపోయాడు. తొలి మ్యాచ్ వర్షార్పాణం కాగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో పంత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. రెండో మ్యాచ్‌లో 6 పరుగులు, చివరి టీ20లో 11 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
ఇలా వరుస వైఫల్యాలాతో సతమతమవుతున్నా.. పంత్‌ను అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లు.. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ఇష్ సోధి పంత్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రిషభ్ పంత్ విధ్వంసరకరమై, ప్రమాదకరమైన ఆటగాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్న’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో సోధి మంచి ప్రదర్శన కనబర్చాడు. కాగా.. పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే విషయంపై మాత్రం క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని.. అతని వల్ల సంజు శాంసన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. పంత్‌ను టెస్టు క్రికెట్‌కు పరిమతం చేసి.. సంజుకు వన్డేలు, టీ20ల్లో అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Ish Sodhi said, “Rishabh Pant is a very destructive and dangerous player. Hopefully he’ll get more chances to play”. (To @Vimalwa).
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2022