దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జూనియర్ డివిలియర్స్ గా పిలవబడుతున్న డెవాల్డ్ బ్రేవిస్.. తన ఐపీఎల్ కలల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు భారత్ లో ఆడటమంటే ఇష్టమని చెప్పాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశమొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని ఉందన్నాడు. ఐపీఎల్ తో పాటు తనకు ఇష్టమైన క్రికెటర్లు, తన లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అచ్చం ఏబీడీ లాగే ఆడే బ్రేవిస్ ను అక్కడి అభిమానులు ‘బేబి ఏబీడీ’ గా పిలుచుకుంటున్నారు. ఈ యువ ఆటగాడు ఏబీడీ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆ దేశ అభిమానులు భావిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అతడి ఆట కూడా అచ్చం డివిలియర్స్ మాదిరే ఉంటోంది. బ్రేవిస్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ కు నేను వీరాభిమానిని. ఒకవేళ ఐపీఎల్ లో ఆడే అవకాశమొస్తే ఆర్సీబీ తరఫున ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే.. నాకు ఇష్టమైన క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి అదే జట్టుకు ఆడుతున్నారు.. అందుకే నేను ఆర్సీబీ’ ని ఎంచుకున్నానని తెలిపాడు.
Dewald Brevis aka Baby AB pic.twitter.com/TBQTICdsns
— Maara (@QuickWristSpin) January 27, 2022
గత సీజన్ వరకు కోహ్లి, డివిలియర్స్ లు ఆర్సీబీ తరఫునే ఆడేవారు. కానీ 2021 సీజన్ తర్వాత డివిలియర్స్ ఐపీఎల్ తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లి కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు చేసిన వ్యాఖ్యలను ఆర్సీబీ టీం మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువగాడిని తీసుకొని ఏబీడీ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అతడిని రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో దక్కించుకోవాలని ఆర్సీబీ యత్నిస్తుందని సోషల్ మీడియాలో ఆ జట్టు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇప్పటికైతే ఆర్సీబీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 13 దాకా ఆగాల్సిందే.
Youngster Dewald Brevis has registered for the IPL 2022 auction. He is a huge fan of Virat Kohli-AB de Villiers duo.
📸: IPL/BCCI#DewaldBrevis #ABdeVilliers #ViratKohli #RCB #IPL2022 #CricTracker pic.twitter.com/c73mI37AME
— CricTracker (@Cricketracker) January 28, 2022