టీమిండియా నూతన సారధి రోహిత్ శర్మ తన మనసులో మాటను బయట పెట్టాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనకు ఎప్పటికీ స్ఫూర్తి అని తెలిపాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు నుంచే సచిన్‌ను అభిమానిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సచిన్ సాధించిన అద్భుతాలను దగ్గరి నుంచి చూశానని చెప్పిన రోహిత్ శర్మ.. దేశం కోసం 25 ఏళ్లపాటు సచిన్ టెండూల్కర్ ఎంతో చేశాడని కొనియాడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని సంవత్సరాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మామూలు విషయం కాదని అన్నాడు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా సచిన్‌ను తాను ఎప్పుడూ అనుసరిస్తానని రోహిత్ శర్మ చెప్పాడు.
సచిన్.. క్రికెట్‌లోనే కాకుండా మైదానం బయట కూడా మంచి మనసు కలిగివుండటం అద్భుతమంటూ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ దిగ్గజంగా పేరు గాంచిన వ్యక్తి.. ఇలా వినయ విదేయతతో ఉండడం కష్టంతో కూడుకున్నదని, కానీ దానిని సచిన్ చేసి చూపించాడని అన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా కొనసాగుతున్నాడు.
— Rohit Sharma Trends™ (@TrendsRohit) April 1, 2022
ఇది కూడా చదవండి: హోం టీమ్‌పై చెలరేగిన చాహల్! ఆనందం పట్టలేక గంతులేసిన భార్య
గతంలో ఐపీఎల్‌లో 6 సీజన్లపాటు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
#Rohit #RohitSharma #Cricket#cricketconnected
Most runs in a single edition of ODI World Cup –673 – Sachin Tendulkar, 2003
659 – Matthew Hayden, 2007
648 – Rohit Sharma, 2019🔥
647 – David Warner, 2019
606 – Shakib al Hasan, 2019 pic.twitter.com/Gg4sPQxdyM
— 𝐑 𝐎 𝐇 𝐈 𝐓 𝐈 𝐀 𝐍 𝐎 𝐌 𝐊 𝐀 𝐑 (@omkarmali45) June 16, 2020
Heart-touching . @ImRo45 @sachin_rt 💙#RohitSharma𓃵 || @mipaltan pic.twitter.com/CEoIFeMYRD
— Sir Dinda⁴⁵ (@SirDindaTweet) March 22, 2022