ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, తన జట్టు సారధిగా హార్ధిక్ పాండ్యా వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను తీసుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 లోగా ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండటంతో పాండ్యాతో పాటుగా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా అహ్మదాబాద్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
📣 Time to announce our Captain welcome Hardik Pandya in Ahmedabad Franchise.#IPL2022 #IPLAuction2022 #IPL2022MegaAuction #Hardik #Ahmedabad #ahmedabadteam pic.twitter.com/heb8Xo8fGU
— Official Ahmedabad IPL Team (@AhmedabadIPL_FC) January 11, 2022
గతంలో అహ్మదాబాద్ టీంకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కాబోతున్నట్లు వార్తలు వినిపించినా,ఇప్పుడు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వచ్చింది.మరోవైపు కె ఎల్ రాహుల్ లక్నోకి సారధ్యం వహించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంఛైజీలు హెడ్ కోచ్‌లు, మెంటార్‌లపై ఓ క్లారిటీకి రాగా, మెగా వేలానికి ముందే ‘ఫ్రీ టికెట్’ ద్వారా ప్లేయర్లను ఎంచుకునే అవకాశం దక్కడంతో ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.