ఐపీఎల్ 2022 మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సీఎస్‌కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎస్‌కే తీరుపై అభిమానులు ముఖ్యంగా తమిళ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమిళ అభిమానులైతే ఏకంగా సీఎస్‌కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్విట్టర్ లో #Boycott_ChennaiSuperKings పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు.
Millions of Tamil people all over the world are deeply shocked and hurt by the decision of @ChennaiIPL to buy a Sri Lankan cricketer who has played for Sri Lankan army cricket team as well.
TN CM should take immediate action @mkstalin#Boycott_ChennaiSuperKings pic.twitter.com/ylsJT1CRJH
— பிரியக்குமார் அ (@ProudTamizhan1) February 14, 2022
ఇంతలా విమర్శలు రావడానికి కారణం ఏంటంటే.. శ్రీలంకలోని తమిళులపై గతంలో లంకేయులు ఎలా ప్రవర్తించారో ప్రపంచమంతా తెలుసు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్ధులుగా మార్చిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టు(చెన్నై సూపర్ కింగ్స్) లోకి ఎలా తీసుకుంటారని అభిమానులు సీఎస్‌కే యాజయాన్యంపై విరుచుకుపడుతున్నారు.. లంక క్రికెటర్ మహీశ్ తీక్షణను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని సోషల్‌మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సీఎస్‌కేకు మరపురాని విజయాలందించిన సురేశ్ రైనా లాంటి ఆటగాడిని కాదని సింహళ ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీక్షణను వెంటనే తొలగించి సురేశ్ రైనాను జట్టులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#Boycott_ChennaiSuperKings
Raina 💔💔💔 pic.twitter.com/bJIvbq3Xnr— Rohith Musulla (@Rohith_Musulla) February 14, 2022