భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు నిలయమైన గాల్వాన్ లోయలో భారత సైనికులు అతిశీతల వాతావరణ పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడుతున్నారు. సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తూర్పు లద్దఖ్ సమీపంలోని గాల్వాన్ లోయలో 2020లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులతో పాటు, 43 మంది చైనా సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రకటించాయి. ఈ దారుణ ఘటన జరిగి దాదాపు మూడేళ్ల కాలం కావస్తోంది. ఈ ప్రాంతం తమదని చైనా వితండవాదం చేస్తోంది. ఎప్పటి నుంచో భారత భూగంలో అంతర్భాగమైన గాల్వాన్ లోయలోకి చోరబడి.. రోడ్లు, ఇళ్లు నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలను మరింత విస్తరించడంతో భారత సైనికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు దేశ సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో చాలా మంది సైనికులు అమరులయ్యారు. అయితే.. తాజాగా ఆ గాల్వాన్ లోయలో భారత సైనికులు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు గాల్వాన్ లోయలో ఇండియన్ ఆర్మీ తన కదలికల్ని పెంచింది. ప్రస్తుతం అక్కడ అతిశీతల వాతావరణం ఉంది. చలికి గట్టకట్టుకుపోయిన ప్యాంగాంగ్ సరస్సుపై హాఫ్ మారథాన్ చేస్తూ.. నిరంతరం పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో సైనికుల్లో ఉత్సహం నింపడం కోసం, చలిని తట్టుకునేందుకు భారత సైనికాధికారులు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. సైనికులు సైతం సరదాగా క్రికెట్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తూ.. ఇండియన్ ఆర్మీ పవర్ ముందు చలి నిలవదంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian Army soldiers playing cricket in Galwan Valley, Ladakh. pic.twitter.com/1gFE9QGbEt
— News Arena India (@NewsArenaIndia) March 4, 2023