ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేదారిలో కాకుండా వేర్వేరు రంగాలను ఎంచుకుని సత్తా చాటుతున్నారు. వారి వారి రంగాల్లో రాణిస్తూ వారెవ్వా అనిపించుకుంటున్నారు. ఒకరు ఆర్మీలో సేవ చేస్తుంటే మరొకరు సినిమా రంగంలో దూసుకుపోతున్నారు.
సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో వారికి వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటూ స్టార్లుగా పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తుంటారు నటీనటులు. దీనికి విభిన్నమైనది రక్షణా రంగం. నిత్యం సవాళ్లతో కూడుకున్నది. ఉగ్రవాదులను ఎదుర్కొంటూ, దేశానికి రక్షణ కల్పిస్తూ ప్రజల ప్రాణాలను, దేశ సంపదను రక్షిస్తుంటారు. నిజ జీవిత రియల్ హీరోలు అని అనిపించుకుంటారు. ఇదే క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ సోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా కలిగి ఉండి దేశ రక్షణలో భాగం పంచుకుంటూ దేశానికి సేవ చేస్తుంది. చెల్లెలు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతుంటే.. అక్క మాత్రం ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి సేవ చేసుకుంటుంది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విభిన్నమైన రంగాలను ఎంచుకుని అసాధారణ రీతిలో రాణిస్తున్నారు. మరి ఆ ఇద్దరు అక్కా చెళ్లెల్లు ఎవరు? వారి స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు కొదవలేదు. అంత మంది ఉన్నప్పటికి కైపెక్కించే తన అందాలతో, నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఆ అమ్మడు. బికినీ ధరించి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేపుతోంది ఆ సుందరాంగి. తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఆ మద్దుగుమ్మ. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. ఇక టాలీవుడ్ కు స్వస్తి చెప్పిన ఆ హాట్ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దుమ్మురేపుతోంది. ఇప్పుడైనా గుర్తు పట్టారా.. ఆమె మరెవరో కాదండి హీరోయిన్ దిశా పటాని.
హిందీలో వచ్చిన ‘ఎం.ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’, భాగీ-2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాన్స్ కు హాట్ హాట్ అందాలతో విజువల్ ట్రీట్ ను అందిస్తుంటుంది దిశాపటాని. ఈమె అక్కనే ఖుష్బూ పటాని. ఖుష్బూ భారత సైన్యంలో చేరి దేశ సేవలో పాలుపంచుకుంటుంది. కాగా ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఖుష్బూ పటానీ, స్టార్ హీరోయిన్ అయిన తన చెల్లి దిశా పటానితో కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ కు అక్కైన ఖుష్బూ పటాని ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తుండడంతో పలువురు ప్రశంసిస్తున్నారు.