మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్… టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్ అంతగా రాణించకపోయినా అల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం తన పవరేంటో చూపించాడు. 160 బంతులను ఎదుర్కొన్న జడేజా 10 ఫోర్లతో సెంచరీ మార్కును చేరుకున్నాడు.
ప్రస్తుతానికి టీమిండియా 112 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది. జడేజా(102), జయాంత్ యాదవ్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు రోహిత్ , మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి చక్కని ఆరంభమే ఇచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించైనా.. పడ్డ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. రోహిత్ (29; 6 ఫోర్లు) పరుగులు చేశాక అవుట్ అవ్వగా.. కాసేపటికే మయాంక్ అగర్వాల్ (33; 5 ఫోర్లు) పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. 3 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హనుమ విహారి (58; 5 ఫోర్లు) పరుగులతో పర్వాలేదనిపించైనా..ఫెర్నాండో బౌలింగ్ లో వెనుదిరిగాడు.ఇక.. ప్రత్యేకమైన ‘100వ’ టెస్టులో (45; 5 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న కోహ్లిని ఎంబుల్దెనియా బౌల్డ్ చేశాడు.ఫార్మాట్ ఏదైనా తన ఆట మారదని మరోసారి నిరూపించాడు రిషబ్ పంత్. అతనికి అయ్యర్ జతకాగా, 2 వికెట్లు తీసిన ఉత్సాహంతో ఉన్న ఎంబుల్దెనియాకు పంత్ తన సిక్సర్ రుచి చూపించాడు. అప్పటిదాకా వన్డే ఆడిన పంత్ ఒక్కసారిగా టి20కి మారిపోయాడు. ఎంబుల్దెనియా వేసిన 76వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 0, 2, 4లతో 22 పరుగులు పిండేశాడు. ధనంజయ డిసిల్వా వేసిన మరుసటి ఓవర్లోనూ 4, 6 కొట్టి 80 దాటాడు. జట్టు స్కోరు కూడా 300 అధిగమించింది. ఇక స్వల్పవ్యవధిలోనే పంత్ మరో రెండు బౌండరీలు కొట్టడంతో సెంచరీ ఖాయమ నుకున్నారంతా! కానీ లక్మల్ నేరుగా సంధించిన బంతిని సరిగా అంచనా వేయలేక పంత్ బౌల్డయ్యాడు. 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ చివరి 46 పరుగుల్ని.. కేవలం 24 బంతుల్లోనే బాదడం విశేషం.
‘Rockstar’ @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022