ఇంగ్లాండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసిరిన భారత్ జట్టు.. ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేల్లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లాండ్ టాపార్డర్ వణికిపోయింది. మొదటి మూడు ఓవర్లకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 26 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. మొదటి ఓవర్లో 6 పరుగులు రాగా.. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. ఆ తరువాత రాయ్ స్థానంలో క్రీజులోకి వచ్చిన జో రూట్ తను ఎదుర్కొన్న రెండో బంతికే క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అవడంతో రూట్ తడబడ్డాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ పంత్ చక్కగా అందుకున్నాడు. తన మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే రెండు వికెట్లు తీశాడు బుమ్రా.
England’s Batting line up collapse #ENGvIND #Bumrah pic.twitter.com/chZGc6igTm
— RVCJ Media (@RVCJ_FB) July 12, 2022
Its flying Rishabh pant ❤️🇮🇳pic.twitter.com/68jmZeSwhg
— Isha Negi (@IshaaNegi17) July 12, 2022
ఆ మరుసటి ఓవర్లోనే షమీ సైతం.. బెన్ స్టోక్స్ (0)ను డకౌట్ చేయడంతో.. ఇంగ్లాండ్ 7 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. తరువాత కొంతసేపటికి బెయిర్ స్టో కూడా వెనుతిరగడంతో ఇంగ్లాండ్ 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పోనీ మిడిల్ ఆర్డర్ అయినా పోరాడుతుందనుకుంటే.. వారు కూడా క్యూ కడుతున్నారు. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ (0) సైతం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన లివింగ్‌స్టోన్.. పూర్తిగా మిస్సయ్యాడు. ఈ క్రమంలో అతని వెనుక నుంచి వెళ్లిన బంతి వికెట్లను కూల్చింది. దాంతో లివింగ్‌స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 12 ఓవర్లలో 46/5 స్కోరుతో నిలిచింది. ఇందులో నాలుగు వికెట్లు బుమ్రా తీసినవే కావడం గమనార్హం.
4 Overs
2 Maidens
6 Runs
4 WicketsJasprit Bumrah at his supreme best 🔥 pic.twitter.com/esDazDvv6m
— CricTracker (@Cricketracker) July 12, 2022
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ జట్టు: జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, క్రెగ్ ఓవర్టాన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే